Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు కాంగ్రెస్ గ్యారెంటీ : పట్నం సునీత మహేందర్ రెడ్డి
Qubetvnews - May 7, 2024 / 10:48 AM IST
Patnam Sunitha Mahender Reddy :
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు భారీ ఎత్తున కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అవ్వడంతో ఆయన మరోసారి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… మన అందరి నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకుల సమక్షంలో, కాంగ్రెస్ శృణుల మధ్య ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమం విజయవంతం అని చెప్పుకోడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలారా ఇక అవిశ్రాంతిగా అలుపెరుగక పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఒచ్చేస్తోంది. రానున్న వారం రోజులు కష్టపడి మన కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకుందాం. ప్రచారంలో భాగంగా మేడ్చల్ లోని జవహర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. చంద్రగిరి నగర్ లో నిర్వహించిన రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ సమావేశం లో పాల్గొన్నారు. జగదిరిగుట్ట బస్ స్టాప్ నుండి నిర్వహించిన రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ సమావేశం లో పాల్గొన్నారు. భగత్ సింగ్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ సమావేశం లో పాల్గొన్నారు. పద్మ నగర్ రింగ్ రోడ్ లో నిర్వహించిన రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ సమావేశం లో పాల్గొన్నారు. సంజయ్ గాంధీనగర్ లో నిర్వహించిన రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ సమావేశం లో పాల్గొన్నారు.
నేను చేస్తున్న ఈ అలుపెరుగని ప్రచారాలు , రేపు రానున్న రోజుల్లో మన మల్కాజ్గిరి ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేందుకే. కావున మీరు కూడా ఒక సారి ఆలోచించి రానున్న ఎంపీ ఎన్నికల్లో మీ అమూల్యమైన వోట్ మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు పైన వేసి నన్ను గెలిపించగలరని మనవి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు నెలల్లోనే సగానికి పైగా హామీలను నెరవేర్చింది. కనుక ముందు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ మరింతగా అభివృద్ది మరియు సంక్షేమంలో దూసుకు పోతుందని సునీత మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇతర పార్టీల మాయ మాటలు నమ్మి వారికి ఓటు వేయడం ద్వారా మల్కాజ్‌గిరి అభివృద్దిని అడ్డుకున్న వారు అవుతారు అంటూ సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.





