Patnam Sunitha Mahender Reddy : హస్తం బాటలో నడుద్దాం, విజయం వైపు అడుగులు వేద్దాం : పట్నం సునీత మహేందర్ రెడ్డి
Qubetvnews - May 9, 2024 / 11:26 AM IST
Patnam Sunitha Mahender Reddy :
మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి చివరి దశ ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఆరు గ్యారెంటీల అమలు గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టబోతున్న అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి బుదవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 150-డివిజన్ లో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి తో కలిసి ఇంటింటి ప్రచారం మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మరియు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ గారిని గెలిపించాలని అభ్యర్థించారు. శ్రమించనిదే ఏదీ సాధ్యం కాదు, విశ్రమిస్తే ఏది సాధించలేము.. ఇక సమయం లేదు కాంగ్రెస్ కుటుంబీకులారా. విస్తృత స్థాయి ప్రచారాలతో మన కాంగ్రెస్ పార్టీ యొక్క బలాన్ని మరింత పెంచుకుందాం, రానున్న ఎన్నికల్లో మనం ఏంటో నిరూపించుకుందాం అంటూ కాంగ్రెస్ శ్రేణులకు సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
పేదల బతుకులు మారాలంటే, కాంగ్రెస్ జెండా సెంట్రల్ లో ఎగరాలి… రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన భవిష్యత్తుని మనమే తీర్చి దిద్దుకుందాం. కార్యసాధన కొరకే ఈ ఎన్నికల బరిలో నించుంటున్నాను. మన మల్కాజ్గిరి ఓటర్ మహాశయులు అందరూ నాకు సహకరించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఎంపీ గా గెలిపించి మన పార్లమెంట్ యొక్క అభివృద్ధికి తొలి మెట్టు గా నిలుస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను.
కూకట్పల్లి నియోజకవర్గం లోని బేగంపేట్ లో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో సునీత పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలిపించడం ద్వారా నియోజకవర్గం దేశంలోనే నెం.1 గా మార్చుతానంటూ హామీ ఇచ్చారు. కూకట్పల్లి లోని ఫతే నగర్ లో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సమయం దగ్గర పడుతోంది కాంగ్రెస్ శ్రేణులారా.. సిద్ధం అవ్వండి.. హస్తం బాటలో నడుద్దాం, విజయం వైపు అడుగులు వేద్దాం అంటూ సునీత కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

Patnam Sunitha Mahender Reddy of Explaining Welfare Programs And Promoting
రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు ఇప్పటికే సునీత మహేందర్ రెడ్డి తరపున ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున ఆమెకు ఓటు బ్యాంక్ మల్లింది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితానికి పూర్తి విభిన్నమైన ఫలితం రాబోతుంది అంటూ ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు. ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వేలో రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారనంగా మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ పార్టీ ఎగురబోతుంది అంటూ తేలింది. ఇంకా పలు సర్వేలు కూడా సునీత గెలుపును చెబుతున్నాయి. మల్కాజ్ గిరి ఓటర్లు అధికార పార్టీ వైపుకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెంట నిలిచి సునీత కు ఓట్లు వేయబోతున్నారు.





