Ktr : కేటీఆర్ చెప్పిందే చేస్తున్న రేవంత్.. వ్యూహం మార్చేశాడా..?

Qubetvnews - July 14, 2024 / 11:48 AM IST

Ktr : కేటీఆర్ చెప్పిందే చేస్తున్న రేవంత్.. వ్యూహం మార్చేశాడా..?

Ktr : రేవంత్ రెడ్డి మొట్టమొదటి సారి సీఎం అయ్యారు. కాబట్టి సీఎంగా తన పేరు చెప్పుకునేలా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎక్కడా తన మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చాలానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వాస్తవంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు బొటాబొటి మెజార్టీ మాత్రమే వచ్చింది. పైగా ఎప్పుడూ కుమ్ములాటలు ఉండే కాంగ్రెస్ లో నిలకడ అనేది తక్కువ.

కాబట్టి మన బలాన్ని కాపాడుకోవడం మీద ఫోకస్ పెట్టడం కంటే కూడా అవతలి వారి బలాన్ని దెబ్బ తీయడమే బెటర్ అని రేవంత్ భావించారు. అప్పుడు ఫిరాయింపులు కాంగ్రెస్ నుంచి కాకుండా బీఆర్ ఎస్ నుంచే ఉంటాయనేది ఆయన ప్లాన్. ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం షురూ చేశారు. అయితే గతంలో బీఆర్ ఎస్ కూడా ఇలాంటి పనే చేసింది. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వరుసగా బీఆర్ ఎస్ లో చేర్చుకుంది. అయితే మొదట్లో బీఆర్ ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని ఎలా చేర్చుకుంటారనే విమర్శలు వచ్చాయి.

దాంతో బీఆర్ ఎస్ నేతలు వేగం పెంచి సీఎల్పీని బీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. తాము కూడా గతంలో చేర్చుకున్నామని.. కానీ సీఎల్పీని బీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నామే తప్ప.. ఇలా రాజీనామాలు చేయించకుండా కొంత మందిని తీసుకోలేదని అంటున్నారు. అయితే ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యూహంగా మారిపోయింది. ఇన్ని రోజులు కొంత మందిని చేర్చుకుందాం బలం పెంచుకుందాం అని రేవంత్ భావించారు. కానీ కేటీఆర్ చెప్పినట్టే బీఆర్ ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే అయిపోతుంది కదా అని భావిస్తున్నారంట.

అందుకే ఇప్పుడు మరింత మందిని చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు రేవంత్. ఇందుకోసం కొన్ని జిల్లాలకు ఇన్ చార్జులను కూడా నియమించారంట. అంటే ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలను చేర్పించే బాధ్యత ఆయా ఇన్ చార్జులకే అప్పగించారన్నమాట. ఇదే ఇప్పుడు రేవంత్ కు ప్లస్ అవుతోందని చెబుతున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News