Revanth Reddy : ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా రేవంత్ కే.. రేవంత్ కు మరింత పెరిగిన ప్రాధాన్యత..!

Qubetvnews - February 21, 2024 / 07:20 PM IST

Revanth Reddy : ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా రేవంత్ కే.. రేవంత్ కు మరింత పెరిగిన ప్రాధాన్యత..!

Revanth Reddy :

ఒకప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీనియర్లు కలిసి ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టేశారు. అసలు రేవంత్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయిందంటూ చాలా మంది ఆరోపించారు. అంతే కాకుండా అధిష్టానానికి కూడా లేఖలు రాసేశారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బీఆర్ ఎస్ మీద ఒంటరి పోరాటం చేస్తుంటే ఆయన్ను కాంగ్రెస్ నేతలే ఎక్కువగా తిట్టారు. అయినా సరే రేవంత్ తన పోరాటాన్ని ఆపకుండా ముందుకు వెళ్లారు. దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. దాంతో రేవంత్ సమర్థత ఏంటో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా అర్థం అయిపోయింది.

ఎంత మంది కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా సరే రేవంత్ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపి ఆయన్ను పార్టీ అధ్యక్షుడిని చేసినందుకు ఆయన ఆ పేరును కాపాడుకున్నారు. అందుకే పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ ను సీఎం చేసింది అధిష్టానం. ఇప్పుడు రేవంత్ మీద మరింత నమ్మకాన్ని పెంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా రేవంత్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడితో అయిపోలేదను భావించింది అధిష్టానం. కాంగ్రెస్ లో రేవంత్ కంటే సీనియర్లు ఎంతో మంది ఉన్నా సరే ఆయనకే కీలక బాధ్యతలు అప్పగిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.

ఇందులో భాగంగా ఎంపీ అభ్యర్థులను డిసైడ్ చేసే బాధ్యతను కూడా ఇప్పుడు రేవంత్ కే అప్పగించింది. అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కూడా రేవంత్ ఫైనల్ చేస్తారన్న మాట. ఈ విషయంలో రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. అందరూ రేవంత్ చెప్పినట్టే వినాలని తెగేసి చెప్పేసింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో ఇప్పుడు రేవంత్ కు పార్టీలో ఏ స్థాయిలో ప్రాధాన్యత పెరిగిందో అర్థం అవుతోందని అంటున్నారు ఆయన అనుచర వర్గం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో రేవంత్ కు పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఇవ్వలేదు కాంగ్రెస్ అధిష్టానం.

కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ పోరాడిన తీరుకు కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఫిదా అయిపోయారు. అందుకే ఇప్పుడు రేవంత్ కు ఎంపీ ఎన్నికల్లో కూడా కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను కూడా ఇప్పుడు రేవంత్ కు అప్పగించారు.

రేవంత రెడ్డి మీద ఎంత నమ్మకం ఉంటే బాధ్యతను మొత్తం ఆయన చేతుల్లోనే పెడతారు చెప్పండి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడిగా చేసిన పార్టీ.. ఆ తర్వాత సీఎంను చేసింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికల బాధ్యతలను కూడా పూర్తిగా రేవంత్ రెడ్డికే అప్పగిస్తున్నారంటే.. ఆయన మీద అధిష్టానంకు ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తోందని చెబుతున్నారు ఆయన అనుచరులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News