CM Revanth Reddy : భట్టి, పొంగులేటికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే నల్గొండ నేతలపై ప్రేమ?…………
Qubetvnews - April 22, 2024 / 02:46 PM IST
CM Revanth Reddy :
కాంగ్రెస్ లో ముసలం పుట్టబోతుందా? త్వరలోనే పార్టీలో చీరికలుండబోతాయన్నా ప్రతిపక్షాల వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా? ఖమ్మం నేతలకి చెక్ పెట్టేందుకే నల్గొండ లీడర్లపై రేవంత్ రెడ్డి ప్రేమ ఒలకబోస్తున్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా భువనగిరిలో మాట్లాడుతూ.. నాతో పాటుగా సీఎం పదవికి ఎవరైనా అర్హుడు ఉన్నాడా అంటూ అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే అని రేవంత్ రెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ లో అంతర్యుద్ధానికి ముందస్తు సూచికా అన్న సందేహాలు మొదలైపోయాయి.
కాంగ్రెస్ రెండుగా చీలిపోనుందనీ, ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు నిలవదనీ, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే వెనకాల చాలా కుట్రలు జరుగుతున్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే చాలాసార్లు ఓపెన్ కామెంట్స్ చేశారు. మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ నేతలైన భట్టి విక్రమార్క, పొంగులేటి పార్టీలో తమ ప్రాబల్యం పెరిగేట్టుగా చూసుకుంటున్నారనీ, ఇతర నేతల్ని కూడా తమకి అనుకూలంగా మల్చుకుంటున్నారన్న వార్తలు గత కొన్నాళ్లుగా గాంధీభవన్ కాంపౌండ్ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఖమ్మం జిల్లా నేతలకు చెక్ పెట్టేందుకే నల్గొండ జిల్లా నేతల్ని ఎంకరేజ్ చేస్తూ రేవంత్ రెడ్డి వారికి ప్రయారిటీ ఇస్తున్నాడన్న అభిప్రాయం తాజాగా రేవంత్ కామెంట్స్ విన్నాక మరోసారి బలపడింది.

CM Revanth Reddy Planning Check Leaders Of Khammam District
మరోవైపు పార్టీలో సంక్షోభం తప్పదు అన్న అపోజిషన్ పార్టీల కామెంట్స్ కి రేవంత్ సంకేతాలిచ్చినట్టుగా కూడా పొలిటికల్ నిపుణులు భావిస్తున్నారు. అందుకే పార్టీకి మెజారిటీ ఉన్నా ఇతర పార్టీల నుంచి నేతల ఫిరాయింపుల్ని భారీగా ప్రోత్సహిస్తున్నారనీ, భవిష్యత్తులో చీలికవస్తే ఆ లీడర్లు తనవైపే ఉండేలా రేవంత్ మెజారిటీ ప్లాన్ చేసుకుంటున్నాడనీ ఇన్ సైడ్ టాక్. మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి లాంటి బలమైన నేతలకి చెక్ పెట్టాలన్నా, తన సీటుకు ఎసరు రావొద్దన్నా నల్గొండ నేతల్ని తనవైపుకి తిప్పుకోనే పనిలో రేవంత్ బిజీ అయ్యాడనేది లేటెస్ట్ భువనగిరి ఎపిసోడ్ తో మరోసారి క్లారిటీగా తెలిసిపోతుందని అన్ని పార్టీల నేతల్లోనూ చర్చలు మొదలైపోయాయి. మరి రేవంత్ కామెంట్స్ వేటికి సంకేతం? ఏ నేతలు రేవంత్ రెడ్డి టార్గెట్ అనేది ఎంపీ ఎలక్షన్స్ అయ్యాక మరి కొన్నిరోజుల్లోనే తేలిపోనుంది





