Revanth Reddy : పార్టీని మించి ఇమేజ్ ను పెంచుకుటున్న రేవంత్.. వైఎస్సార్ బాటలోనే..!

Qubetvnews - March 28, 2024 / 12:24 PM IST

Revanth Reddy : పార్టీని మించి ఇమేజ్ ను పెంచుకుటున్న రేవంత్.. వైఎస్సార్ బాటలోనే..!

Revanth Reddy : సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నాయకుడిగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కేవలం కొందరికి మాత్రమే సొంతం అవుతుంది. అయితే ఇలా సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నేత అనిపించుకోవాలంటే ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ కలిగి ఉండాలి. ప్రజల్లో పార్టీ రేంజ్ లో ఇమేజ్ ఉంటే కచ్చితంగా అతను ఎక్కడున్నా అతనికి మంచి పొజీషన్, రాజకీయ భవిష్యత్ ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయం ఇప్పుడు రేవంత్ బాగానే పాటిస్తున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి సొంతంగా కష్టపడి పైకి వచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన సొంతంగా ప్రజల్లో ఇమేజ్ ను పెంచుకున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ లోకి వచ్చినా సరే కాంగ్రెస్ సీనియర్లను పక్కన పెట్టి మరీ ఆ పార్టీపగ్గాలు రేవంత్ కు ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని రేవంత్ సద్వినియోగం చేసుకున్నారు. చాలా కష్టాలు పడిపార్టీని అధికారంలోకి తెచ్చారు. అనుకున్నట్టు గానే రేవంత్ సీఎం అయి చూపించారు. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే రేవంత్ ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ఇది భవిష్యత్ లో కూడా కొనసాగాలంటే కేవలం పార్టీ ఇమేజ్ ను నమ్ముకుంటే సరిపోదు.

రేవంత్ రేపు మరోసారి సీఎం అవ్వాలన్నా.. పార్టీలో ఆయనపట్టు పెరగాలన్నా సరే తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు సొంతంగా ఇమేజ్ ఉండాలి. అప్పుడే ఆయన మరోసారి సీఎం అవ్వగలుగుతారు. ఈ విషయాలు రేవంత్ కు తెలియనివి కావు. అందుకే ఇప్పుడు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో రేవంత్ సొంత ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. సొంతంగా ఆయన కంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎమ్మెల్యేల్లో ఎక్కువగా రేవంత్ వర్గీయులే ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ఎంపీల్లో కూడా రేవంత్ తన వర్గానికే ఎక్కువ టికెట్లు కేటాయించుకుంటున్నారు.

ఇలా ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో తన పట్టు పెంచుకుంటే.. ఆటోమేటిక్ గా తన ఇమేజ్ పెరుగుతుందని రేవంత్ భావిస్తున్నారు. ఒక పార్టీలో, ఒక ప్రభుత్వంలో ఒక వ్యక్తి పెత్తనమే నడుస్తుంది అంటే మాత్రం కచ్చితంగా ఆ వ్యక్తి చుట్టూ రాజకీయాలు అల్లుకుంటాయి. అదే ఇప్పుడు రేవంత్ చేస్తున్న పని.

ఆయన సొంతంగా ఇమేజ్ ను పెంచుకుంటున్నాడు కాబట్టి.. రేపు భవిష్యత్ రాజకీయాల్లో కూడా తన పేరు మార్మోగిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీని మించి సొంతంగా ఇమేజ్ పెంచుకున్నాడు. అందుకే ఆయన రెండుసార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు రేవంత్ కూడా వైఎస్ బాటలోనే నడుస్తున్నాడు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News