Revanth Reddy : రేవంత్ రెడ్డి జాగ్రత్తలు.. బీఆర్ ఎస్ కు ఛాన్స్ ఇవ్వకుండా..?
Qubetvnews - April 1, 2024 / 01:41 PM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఎన్ని విమర్శలు చేసినా ఎంత దూకుడుగా వ్యవహరించినా అది చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడినా.. ఏం చేసినా సరే విమర్శలు, ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల మద్దతు ఉంటుంది. ఈ విషయాలు రేవంత్ కు కూడా బాగానే తెలుసు. అందుకే ఆయన ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఒకప్పుడు బీఆర్ ఎస్ ను ఏయే విషయాల్లో అయితే విమర్శించారో.. ఇప్పుడు తనను, తన ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశాలు కూడా ఇవ్వకూడదని రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చెప్పిన మాటపై నిలబడేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రధానంగా వస్తున్న విమర్శలు ఏమంటే.. పంటలు ఎండిపోతున్నాయనేది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వట్లేదని.. రైతుల పంటపొలాలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.
అటు కేసీఆర్ పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోతే వాటిని పరిశీలించి కాంగ్రెస్ మీద చాలానే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అలెర్ట్ అయిపోయారు. తన మీద వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్లకు స్పెషల్ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే వరి పొలాలు ఎండిపోతున్నాయో స్థానికంగా ఉండే చెరువులు, లేదా కుంటల నుంచి నీళ్లను విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారంట రేవంత్ రెడ్డి.
ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోకుండా చూడాలని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లాయంట. దాంతో పాటు అదే సమయంలో ఎండిపోతున్న పొలాలకు నష్టపరిహారం కూడా ఇస్తామని చెబుతున్నారు. ఎకరాకు పదివేల చొప్పున ఇస్తామని ఇప్పటికే మంత్రులు ప్రకటిస్తున్నారు.
ఇలా రైలు నుంచివ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రేపు వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఈ విషయంలో తమ మీద విమర్శలు రాకుండా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.



