Congress : కాంగ్రెస్ సభ తుక్కుగూడలో.. రేవంత్ ఇమేజ్ పెరిగే ఛాన్స్..!
Qubetvnews - March 24, 2024 / 09:41 AM IST
Congress : కాంగ్రెస్ ఇప్పుడు సెంటిమెంట్ ను బాగా నమ్ముతోంది. ఎక్కడైనా ఏదైనా కలిసొచ్చే అంశం ఉంటే.. దాన్ని ప్రధానంగా పాటించేందుకు రెడీ అవుతోంది. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి కొన్ని సెంటిమెంట్ లను ఫాలో అయింది. అది బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఏకంగా కాంగ్రెస్ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. దెబ్బకు కాంగ్రెస్ ఇమేజ్ ఇప్పుడు తెలంగాణలో అమాంతం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. కాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎంపీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ నే నియమించింది పార్టీ అధిష్టానం.
ఇప్పుడు ఎంపీ ఎన్నికల కోసం కూడా బాగానే ప్లాన్లు వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ముందుగా సౌత్ ఇండియాలోనే భారీ సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ కు బాగా కలిసివచ్చిన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోనే దీన్ని నిర్విహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇక్కడి నుంచే సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. దాంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది.
కాగా ఇప్పుడు కూడా సౌత్ ఇండియాకు సంబంధించిన ప్రచార సభను ఇక్కడి నుంచే ప్రారంభిచబోతోంది కాంగ్రెస్. ఈ విషయాన్ని ఏఐసీసీ కమిటీ స్వయంగా స్టేట్ కమిటీకి చెప్పేసింది. అయితే ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింత పెరగబోతుందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నా కూడా తెలంగాణనే ఎంచుకున్నారు. పైగా ఇక్కడ కాంగ్రెస్ సీఎంగా రేవంత్ ఉన్నారు. కాబట్టి ఆయన ఈ సభను భారీ ఎత్తున నిర్వహిస్తే అది జాతీయ మీడియాలో బాగానే కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సభను దాదాపు 10లక్షల మందితో నిర్వహించనున్నారంట.
ఇందుకోసం రేవంత్ స్వయంగా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సభలోనే లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను విడుదల చేయబోతున్నారు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ లోక్ సభ మేనిఫెస్టోను ఇక్కడే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. కాబట్టి ఈ విధంగా తెలంగాణ టాక్ ఆఫ్ ద నేషన్ కాబోతోంది.
లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది లేదు. కాబట్టి ఇది రేవంత్ ఇమేజ్ ను పెంచే అంశం అనే చెప్పుకోవాలి. రేవంత్ గనక వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఆయన ఇమేజ్ నేషనల్ లెవల్ లో పెరిగే అవకాశాలు ఉన్నాయి.





