Pawan Kalyan : పిఠాపురానికే పవన్ ను పరిమితం చేయబోతున్న వైసీపీ..?

Qubetvnews - March 29, 2024 / 09:49 AM IST

Pawan Kalyan : పిఠాపురానికే పవన్ ను పరిమితం చేయబోతున్న వైసీపీ..?

Pawan Kalyan : అందరికీ ఏమో గానీ.. పవన్ కల్యాన్‌ కు మాత్రం ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టు తయారయ్యాయి. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగాఉండి కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు పనవ్ కల్యాణ్‌. పదేండ్లు అవుతోంది పార్టీ పెట్టి.. కానీ ఇంత వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు ఆయన పార్టీలో. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి గనక ఓడిపోతే ఇక రాజకీయ భవిష్యత్ లేనట్టే.. ఇంకా చెప్పాలంటే ఈ సారి గనక ఓడిపోతే పవన్ రాజకీయాలను వదిలేస్తాడేమో. అందుకే ఈ ఎన్నికలు పవన్ కల్యాణ్‌ కు అత్యంత కీలకంగా చెప్పుకుంటున్నారు.

చాలా రాజకీయ సమీకరణాలు వేసుకున్న తర్వాత పవన్ కల్యాణ్‌ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపాడు. కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టే ఈజీగా గెలుస్తానని అనుకుంటున్నాడు పవన్ కల్యాణ్‌. అయితే పవన్ ను ఓడించేందుకు వైసీపీ భారీ వ్యూహాలు రచిస్తోంది. పవన్ కు ధీటుగా కాకినాడ ఎంపీ వంగా గీతను రంగంలోకి దింపారు జగన్. ఆమె కాపు ముద్దు బిడ్డగా దూసుకుపోతోంది. కాపుల్లో మంచి పట్టు కూడా ఉంది. అంతే కాకుండా లోకల్ క్యాండిడేట్. అయితే పవన్ కూడా పిఠాపురంను సీరియస్ గానే తీసుకుంటున్నాడు. ఈ నెల 30న ఆయన పిఠాపురంకు వెళ్తున్నాడు. మూడు రోజుల పాటుఅక్కడే ఉండి ముఖ్య నేతలను కలుస్తాడు.

ఇది మంచిదే కావచ్చు.. కానీ వైసీపీని తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ అంటే సినీస్టార్ హీరో. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తిని ఇప్పుడు పిఠాపురానికి పరిమితం చేస్తే బాగుంటుందని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకే పిఠాపురంలో అన్ని రకాలుగా పవన్ ను ఓడించేందుకు అస్త్రాలను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వంగా గీతను దింపడం ఒక ఎత్తు అయితే.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో జగన్ మాట్లాడి అలక వీడేలా చేశారు. దాంతో ఇప్పుడు దొరబాబు వంగ గీత గెలుపుకోసం బాగానే పని చేస్తున్నాడు.

అయితే ఇక్కడేపవన్ కు మరో భయం కూడా ఉంది. అదే ఎస్ వీ ఎస్ ఎన్ వర్మ. ఆయన చాలా కాలంగా టీడీపీ నుంచే పోటీ చేస్తున్నాడు. అయితే ఈ ఎన్నికల్లో కనిపించే ప్రత్యర్థి వైసీపీ అయితే.. కనపడని ప్రత్యర్థి వర్మ అంటున్నారు. పవన్ గెలుపుకోసం మనస్పూర్తిగా వర్మ పనిచేయట్లేదని అంటున్నారు.

ఎందుకంటే ఎవరి స్వార్థం వారిది. ఈ ఎన్నికల్లో పవన్ ఓడిపోతే మళ్లీ వచ్చే ఎన్నికల నుంచి తనకే టికెట్ వస్తుందని వర్మ ఆశిస్తున్నాడు. అందుకే పవన్ కు వందశాతం సాయం చేయకపోవచ్చని అంటున్నారు. ఇలా అటు ప్రత్యర్థి పార్టీల నుంచి ఇటు వర్మ నుంచిపవన్ కు చిక్కులువస్తున్నాయి. అందుకే ఆయన ఎక్కువగా పిఠాపురంలోనే ఉండేందుకు నిర్ణయించుకుంటున్నాడు. మొత్తంగా వైసీపీ వేసిన ఎత్తుగడలో పవన్ చిక్కుకున్నాడనే అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Uncategorized in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News