Pawan Kalyan : టీడీపీ, జనసేన మాస్టర్ ప్లాన్.. జగన్ కు భారీ షాక్ తప్పదా..?
Qubetvnews - July 28, 2024 / 12:57 PM IST
Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో వైసీపీని కోలుకోని విధంగా దెబ్బ తీయడానికి పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వారిద్దరి గురి మొత్తం వైసీపీమీదనే పెట్టారు. ఎలాగైనా వైసీపీని కోలుకోని విధంగా దెబ్బ తీయడానికి వాళ్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓ ప్లాన్ వేశారంట. ఇప్పుడు వాస్తవానికి ఏపీలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఓడిపోయినా కూడా ఆ పార్టీకి 40 శాతం ఓటింగ్ ఉంది. అంతే కాకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆ పార్టీ బలంగా ఉంది. అంటే సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇలా అన్నీ వైసీపీ చేతిలోనే ఉన్నాయి.
ఒక్క ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి గెలవకపోవచ్చు గానీ.. తర్వాత పాలన మొత్తం వైసీపీ చేతిలోనే ఉంది. కాబట్టి వారిని ఇప్పుడు తమ పార్టీలో విలీనం చేసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ కు పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాన్ ఇప్పుడు పంచాయతీ నిధులు, గ్రామ స్థాయిలో ఉండాల్సిన మౌలికవసతులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. దాంతో పాటు గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను జనసేనలో చేర్చుకోవాలని డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తోంది.
అంటే కింది స్థాయి లీడర్లను మొత్తం జనసేనలో విలీనం చేసుకుంటే రాబోయే ఎన్నికల వరకు పార్టీ బలంగా తయారవుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కాబట్టి ఈ లెక్కన పవన్ కల్యాణ్ దెబ్బకు వైసీపీ ఖాళీ అవబోతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఇక పై స్థాయి లీడర్లను టీడీపీ లాగేసుకోవాలని చెబుతోంది. అంతే కాకుండా జనసేన ఇలా వైసీపీ నేతలను లాగేసుకోడానికి చంద్రబాబు కూడా బాగానే సహకరిస్తున్నారంట. అంటే పవన్ కల్యాణ్ దెబ్బకు వైసీపీ త్వరలోనే ఖాళీ అవబోతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో గ్రామాలకు వచ్చే నిధులు చాలానే మళ్లించినట్టు చెబుతున్నారు.
అందుకే సర్పంచు
లు, ఇతర లీడర్లు కూడా కాస్త నిరాశలోనే ఉన్నారు. ఇప్పుడు ఎలాగూ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి.. త్వరలోనే వారందరికీ నిధుల ఆశ చూపించి జనసేనలోకి లాగేసుకోవాలని పవన కల్యాణ్ భవిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి జనసేన, టీడీపీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో.



