Congress : కాంగ్రెస్ టార్గెట్ 16.. డేట్ లైన్ ఫిక్స్ చేసుకున్న రేవంత్..
Qubetvnews - July 19, 2024 / 07:42 PM IST
Congress : రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఐదేండ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటున్నారు. ఆయన మొదట్లో సీఎం అయినప్పుడే కొందరు బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ కుప్పకూలిపోతుందని.. రేవంత్ దిగిపోతాడని రకరకాల కామెంట్లు చేశారు. వాటిని రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ బీఆర్ ఎస్ ను ప్రారంభింకచారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ లాగేసుకుంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ లోకి బీఆర్ ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. బీఆర్ ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇందులో పది వెళ్లిపోయారు కాబట్టి ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 38లో రెండో భాగం అంటే 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి అప్పుడే బీఆర్ ఎస్ ఎల్పీ సీఎల్పీలో విలీనం అవుతుంది. అప్పుడు బీఆర్ ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దాని గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే కొంత మందిని చేర్చుకుంటే చట్టం ప్రకారం వారితో రాజీనామా చేయించాల్సి వస్తుంది. కాబట్టి వచ్చే అసెంబ్లీ సెషన్ ప్రారంభం అయ్యేలోపే ఈ టార్గెట్ ను ఫినిష్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారంట.
అందుకోసం డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీ లోపు బీఆర్ ఎస్ నుంచి మరో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అలా అయితే అప్పుడు బీఆర్ ఎస్ కూడా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించమని పట్టుబట్టేందుకు అవకాశాలు ఉండవు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలను చేర్చేసుకోవాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే మిగతా 16 మంది ఎమ్మెల్యేలతో చర్చలు కూడా జరుపుతున్నారంట. ఇందులో చాలా మంది కాంగ్రెస్ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి తనకు లీగల్ గా ఎలాంటి సమస్యలు ఉండొద్దని.. ప్రతిపక్షాలకు విమర్శించేందుకు అవకాశాలు ఉండొద్దని భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మందిని బీఆర్ ఎస్ విలీనం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ ఎల్పీని కూడా విలీనం చేసుకుంటే.. బీఆర్ ఎస్ కు ప్రశ్నించే అవకాశాలు ఉండొద్దని రేవంత్ భావిస్తున్నారు.



