TDP : పొద్దుటూరు టికెట్ టీడీపీ కనుక ఆయనకిస్తే.. వైసీపీ గెలిచినట్లే

Qubetvnews - February 17, 2024 / 11:03 AM IST

TDP : పొద్దుటూరు టికెట్ టీడీపీ కనుక ఆయనకిస్తే.. వైసీపీ గెలిచినట్లే

TDP :

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్రొద్దుటూరు టికెట్ విష‌య‌మై ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌పై చంద్రబాబు అన‌ధికారికంగా క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ ఇన్‌చార్జ్ ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డినే బ‌రిలో దింపాల‌ని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేర‌కు ప్ర‌వీణ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఈ విష‌యాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి ప్రొద్దుటూరు, అలాగే క‌డ‌ప పార్లమెంట్ టికెట్లపై క్లారిటీ ఇచ్చారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రొద్దుటూరు టీడీపీలో విబేధాలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. అయితే ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌పై ఆయ‌న క్లారిటీ ఇవ్వడంతో ఫలితం ఎలా ఉంటుందో తేల్చి చెప్పిన‌ట్టైంది.

ఇది ఇలా ఉంటే రెండేళ్ల క్రిత‌మే క‌డ‌ప పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా త‌న పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారని ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి మీడియాతో అన్నారు. ఇదే సంద‌ర్భంలో ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ త‌మ‌కంటే త‌మ‌క‌ని కొంద‌రు నేత‌లు ప్రకటించుకుంటున్నారని, దీనిపై ఏమంటార‌ని మీడియా ప్రతినిధులు నిలదీశారు. ప్రొద్దుటూరులో గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌కు తెర‌ప‌డేది ఎప్పుడ‌న్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు.

టికెట్ త‌మ‌కంటే త‌మ‌క‌ని మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి, ప్ర‌వీణ్‌రెడ్డి, లింగారెడ్డి, సీఎం సురేష్‌నాయుడు ఎవ‌రికి వారుగా ప్ర‌క‌టించుకున్నారు. మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, ప్రొద్దుటూరులో త‌మ‌కే బ‌లం ఉంద‌ని, తామైతేనే గెలుస్తామ‌ని వెల్ల‌డించారు. టీడీపీలోని ఇత‌ర నేత‌లు చెబుతున్న‌ట్టు వారికి టికెట్ ఇవ్వ‌ర‌ని గతంలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్నారు. ఆ సమయంలో లింగారెడ్డి మాట‌ల‌కు ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ప్రొద్దుటూరు టికెట్ త‌న‌కే అని, ఒక‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కోరారు. పార్టీ బ‌లోపేతానికి నాలుగేళ్ల‌కు పైగా తాను క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని, జైలుపాలు అయ్యాన‌ని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఇటీవ‌ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గ‌మంతా క‌లియ‌తిరుగుతూ త‌న‌కే టికెట్ ఇస్తార‌ని, ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ నేప‌థ్యంలో ప్రవీణ్ ను విజ‌య‌వాడ‌కు పిలిపించుకుని చంద్ర‌బాబు…. ప్రొద్దుటూరు రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్ర‌వీణ్‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి, గెలుచుకుని రావాల‌ని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించి పంపారని తెలిసింది. ప్ర‌వీణ్‌కే టికెట్ ఇవ్వ‌డం వెనుక లోకేశ్ ప్రోద్బ‌లం ఉన్న‌ట్టు తెలుస్తోంది. కానీ, ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్‌కే ఇస్తే… ఆ నియోజ‌క‌వ‌ర్గం ముచ్చటగా మూడోసారి వైసీపీ ఖాతాలో ప‌డ్డట్టే అని బహిరంగంగానే చర్చించు కుంటున్నారు.

 Clarity On TDP Ticket For Proddatur

Clarity On TDP Ticket For Proddatur

ప్ర‌వీణ్ అభ్య‌ర్థి అయితే ప్రస్తుత ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని ఎదుర్కోవ‌డం క‌ష్టం. రాచ‌మ‌ల్లుపై సొంత పార్టీలో అస‌మ్మ‌తి ఉన్న‌ప్ప‌టికీ, అటు వైపు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేక‌పోతే టీడీపీకి ఆదరణ దక్కదు. మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి టికెట్ ఇస్తే పోరు రసవత్తరంగా ఉంటుంది. కానీ ప్రొద్దుటూరు టికెట్ టీడీపీ అగ్రనేత ఆయ‌న‌కు ఇచ్చే ప‌రిస్థితి లేదు. కావున ఎన్నిక‌ల‌కు ముందే ప్రొద్దుటూరు సీటు అధికార పార్టీ ఖాతాలో పడినట్లే అని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News