Nara Lokesh : చంద్రబాబుకు భారం తగ్గిస్తున్న లోకేష్.. ఆ విషయంలో జాగ్రత్త..!
Qubetvnews - July 19, 2024 / 10:00 AM IST
Nara Lokesh : ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రజలను కలుపుకుని పోవడం ఎంత ముఖ్యమో.. పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకుని పోవడం అంతకన్నా ముఖ్యం. ప్రభుత్వం అంటే సీఎం, మంత్రులు మాత్రమే కాదు. ఎమ్మెల్యేలు అత్యంత కీలకం. మరోసారి అధికారంలోకి రావాలంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పని కావాలంటే అది చేసి పెట్టాలి. అప్పుడే ప్రజల్లో ఆ ఎమ్మెల్యేలకు అంతో ఇంతో పేరు వస్తుంది. లేకపోతే పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వస్తుందని గుర్తుంచుకోవాలి. కాగా ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో మాత్రం చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ఇప్పుడు మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేల సమస్యలను వినాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎలాగూ చంద్రబాబు చాలా బిజీగా ఉంటున్నారు కాబట్టి.. ప్రభుత్వంలో అంత పవర్ ఫుల్ అయిన లోకేష్ కు ఆ బాధ్యత అప్పగించారంట. అందుకే ఇప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా లోకేష్ ను కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారు లోకేష్. ప్రజల సమస్యలను ఉదయం 6గంటల నుంచి 7 గంటల వరకు వింటున్నారు. ఇలా ప్రతి రోజూ ప్రజలను కలిసేందుకు ఓ సమయం కేటాయిస్తున్నారు.
అలాగే ఎమ్మెల్యేల సమస్యలను వినేందుకు కూడా ఓ సమయం కేటాయించుకుంటున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడాలు లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేల వినతులను స్వీకరిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలను, చేయాల్సిన పనులను లోకేష్ కు వివరిస్తున్నారు. అంతే కాకుండా తమ నియోజకవర్గాలకు రావాల్సిన నిధులను కూడా కేటాయించాలంటూ కోరుతున్నారు లోకేష్. దాంతో లోకేష్ కూడా వారి సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. నిధుల కేటాయింపుపై ఆయా శాఖల మంత్రులకు వాటిని సిఫారసు చేస్తున్నారు.
పై స్థాయి అధికారులకు చెప్పి వెంటనే ఆయా పనులను కూడా చేయించేస్తున్నారు. దాంతో ఇటు ఎమ్మెల్యేలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. ఇలా చంద్రబాబు చేయాల్సిన పనులను లోకేష్ చేస్తూ ఆయనకు భారం తగ్గిస్తున్నారంట. ఎమ్మెల్యేలతో సీఎం టచ్ లో లేరనే వెలతిని లోకేష్ తీరుస్తున్నారన్నమాట.




