Nara Lokesh : విశాఖ జిల్లా మంత్రిగా నారా లోకేష్..?

Qubetvnews - June 30, 2024 / 08:11 PM IST

Nara Lokesh : విశాఖ జిల్లా మంత్రిగా నారా లోకేష్..?

Nara Lokesh : ఇప్పుడు ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వంలో మొత్తం చంద్రబాబు సహా 25 మంత్రి మంత్రులు ఉన్నారు. ఇందులో ప్రతి జిల్లా నుంచి మంత్రులు ఉండేలా చూడాలనుకున్నారు. అయితే కొన్ని జిల్లాల నుంచి ముగ్గురేసి మంత్రులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇలా ముగ్గురేసి ఉన్నారు. అలా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్క వంగలపూడి అనిత మాత్రమే ఉన్నారు. ఆమెకు చాలా కీలకమైన హోం శాఖను కేటాయించారు. కానీ ఆమెకు కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కోటాలో మంత్రి పదవి దక్కింది. కానీ విశాఖ జిల్లా నుంచి చూసుకుంటే ఎవరూ లేరు.

గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అనకాపల్లి జిల్లా నుంచేఇద్దరు మంత్రులు ఉన్నారు. విశాఖ జిల్లాను మాత్రం పక్కన పెట్టేశారు జగన్. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే చేస్తుంటే కచ్చితంగా రేపు వైసీపీ నుంచి విమర్శలు రాక మానవు. కాబట్టి విశాఖ జిల్లాకు ఇన్ చార్జి మంత్రిని నియమించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారంట. ఎందుకంటే ఇప్పుడు విశాఖ జిల్లాను ఆర్థిక రాజధానిగా చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టించాలన్నా.. మౌళిక వసతుల కల్పనలో ముందు ఉంచాలన్నా సరే ఒక ఇన్ చార్జి మంత్రి కచ్చితంగా కావాల్సిందే.

అందుకే ఇప్పుడు నారా లోకేష్ ను ఇన్ చార్జి మంత్రిగా చేయాలని చూస్తున్నారంట. ఇందుకోసం త్వరలోనే ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో నారా లోకేష్ ది కీలకపాత్ర. అన్ని శాఖలను సమన్వయం చేయగల వ్యక్తి కాబట్టి.. ఆయన అయితేనే విశాఖ జిల్లాను ఆర్థిక రాజధానిగా చేయడంలో చొరవ చూపొచ్చు అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారంట. పైగా ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి.. విశాఖను ఐటీ విభాగంలో అభివృద్ధి చేయాలంటే లోకేష్ అయితేనే బెటర్ అని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లా ఇన్ చార్జి మంత్రి అంటే ప్రతీ రెండు నెలలకోసారి జిల్లా అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించి దానికి ఇంచార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. పైగా విశాఖలోనే స్టీల్ ప్లాంట్, ఏయూ ఉన్నాయి. భవిష్యత్ లో ఇక్కడ పెట్టుబడులు పెంచిన ఘనత తమ నారా కుటుంబానికి దక్కాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి లోకేష్ ఎలా డెవలప్ చేస్తారనేది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News