YCP : వైసీపీ నుంచి ఎన్నికల బరిలో సామాన్యులు.. ఆస్తుల లెక్కలు చూస్తే అవాక్కే..!
Qubetvnews - April 27, 2024 / 07:01 AM IST
YCP :
రాజకీయాలంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఎన్నికల్లో నిల్చోవడం అంటే ఆర్థికంగా సత్తా వాళ్లకే సాధ్యం. సామాన్యులకీ, ధనబలం లేని వాళ్లు పాలిటిక్స్ లోకి దిగడం, నిలదొక్కోవడం అంటే కష్టమే కాదు.. అసాధ్యం కూడా అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఎంత చిన్న ఊరికి సర్పంచ్ గా ఎన్నికల్లో నిల్చున్నా తక్కువలో తక్కువ లక్షలు ఖర్చయ్యే రోజులివి. ప్రచారానికీ, పంపకాలకీ పొలాలో, భూములో తాకట్టు పెడితే గానీ పనవ్వని కాలమిది. అలాంటిది ఎమ్మెల్యే ఎన్నికల బరిలో లక్షల సంపాదన మాత్రమే ఉన్నవాళ్లు అభ్యర్థులుగా నిలబడ్డం అంటే మాటలా?
ఎస్.. ఈసారి సామాన్యులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. సొంత ఇల్లు కూడా లేని క్యాండిడేట్లు సైతం ఈ ఎలక్షన్లలో పోటీకి నిలబడ్డారు. వైసీపీ నుంచి ఇలా ముగ్గురు ఉండడం విశేషం. తమ అఫిడవిల్లో వెల్లడించిన ఆస్తుల వివరాలు చూశాక నిజమేనా అని విస్తుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా సార్జాల తిరుపతిరావు నామినేన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆస్తి మొత్తం 4 లక్షల 20 వేల 766 రూపాయలే. చరాస్తుల విలువ లక్షా 89 వేల 642 రూపాయలు కాగా, బ్యాంక్ అకౌంట్ లో తొమ్మిదివేల రూపాయలు, ఒక బైక్, 1.65 లక్షల విలువైన బంగారం, చేతిలో 15 వేల రూపాయలున్నాయన అఫిడవిల్లో పేర్కొన్నారు. సంపాదనలో అపర కుబేరుడైన టీడీపీ అభ్యర్థి వసంత క్రిష్న ప్రసాద్ పై ఇంతటి సామాన్యుడు పోటీ చేయడంతో ఈ ఎన్నికలో ఎవరిది గెలుపని అంతటా ఆసక్తి నెలకొంది.
శింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ గా ఉన్న ఎం వీరాంజనేయులు వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేయడంతో వార్త తెలిసిన వాళ్లంతా అవాక్కవుతున్నారు. ఆయన దగ్గర స్థిర, చరాస్తులకు సంబంధించి కేవలం 1,06,478 రూపాయలు మాత్రమే ఉన్నాయట. 50 వేల రూపాయల నగదుతో పాటు ఎస్‌బీఐలో 11,193 రూపాయలు, ఓ బైక్ మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్ ద్రుష్టిలో పడి ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్దిగా తల పడుతున్నారు. అయితే తనకు అన్నం పెడుతున్న టిప్పర్ పైనే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రావడం విశేషం.

Common People Are Contesting From YCP
మడకశిర రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు లక్కప్ప. ఆయన వద్ద ఎలాంటి స్థిర చరాస్థులు లేవు. కేవలం2,783 రూపాయాలు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు. కెనరా బ్యాంకు ఖాతాలో 11 రూపాయలు, ఏడీసీసీ బ్యాంకులో రూ. 26,950 రూపాయలు, యూనియన్ బ్యాంకులో రూ. 881తో పాటు 1,13,050 రూపాయల అప్పున్నట్టు తెలిపారు.ఇందులో బ్యాంకు లోన్ రూ. 86,100 కాగా, ఇతర అప్పులు రూ. 26,950 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా స్థిర చర ఆస్తులు కలిపి రూ. 99,883 మాత్రమే ఉన్నాయట. టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉన్న ఎమ్మెస్ రాజు పైన పోటీకి దిగిన లక్కప్ప ఇంతటి సామాన్యుడా అంటూ సోషల్మీడియాలోనూ చర్చ నడుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ఈ సామాన్యులు ఎలాంటి ఫలితాన్ని చూడబోతున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది త్వరలోనే తేలిపోనుంది.





