Geethanjali : గీతాంజలి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా టీడీపీ పోస్టులు.. చనిపోయినా వదలరా…!
Qubetvnews - March 13, 2024 / 07:15 PM IST
Geethanjali : టీడీపీ అల్లరి మూకల ట్రోలింగ్ కు నిండు ప్రాణం బలైపోయిందని వైసీపీ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు ఏపీలో గీతాంజలి ఆత్మహత్య ఎంత సంచలనం రేపుతుందో చూస్తున్నాం. ఒక సాధారణ మధ్యతరగతి మహిళ అయిన గీతాంజలి ఎన్నో కలలు కన్నది. ఆమె కలను నిజం చేస్తూ సొంతింటిని కేటాయించింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేదల సొంతింటి కల నిజమైంది. ఇందులో భాగంగానే గీతాంజలి సొంతింటి కల కూడా నిజం చేశారు సీఎం జగన్. ఆమె తన ఆనందాన్ని పట్టా అందుకున్న తర్వాత మీడియాతో వ్యక్తం చేశారు.
ఆమె మాటల్లో జగన్ కు కృతజ్ఞతలు మాత్రమే తెలిపారు. అంతే గానీ ఎక్కడా కూడా ప్రతిపక్షాల ఊసే ఎత్తలేదు. కేవలం జగన్ చేసిన మంచిని చెప్పడమే ఆమెకు పాపం అయింది. ఇంకేముంది టీడీపీ సోషల్ మీడియాలో దారుణంగా ఆమెను ట్రోల్ చేసింది. అవి ఆమెపై అనుచిత పోస్టులు, దారుణమై కామెంట్లు చూసి ఆమె కన్నీరు మున్నీరైపోయింది. ఎంతో గౌరవంగా బతుకుతున్న ఆమెను టీడీపీ సోషల్ మీడియా బజారుకీడ్చింది. ఆమెపై వస్తున్న ట్రోలింగ్ తట్టుకోలేకనే మనో వేదన చెంది చివరకు ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త స్వయంగా వెల్లడించారు.
దాంతో ఇప్పుడు టీడీపీ-జనసేన సైలెంట్ అయిపోయాయి. నింద ఎక్కడ తమ మీదకు వస్తుందో చంద్రబాబు అండ్ లోకేష్ ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు. చనిపోయిన తర్వాత కూడా గీతాంజలిని వదలట్లేదు. ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా మరో తప్పుడు ప్రచారానికి తెర తీస్తున్నారని వైసీపీ ఆరోపిస్తో ంది. ఫేక్ వీడియోలు సైతం తయారుచేసి , దానికి వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె వ్యక్తిత్వం మరింత దెబ్బ తినేలా ప్రచారం చేస్తున్నారు. చివరకు చనిపోయిన తర్వాత కూడా ఆమెను వదలట్లేదు టీడీపీ బ్యాచ్. ఆమె క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే ఆమె మీద చేసిన ట్రోలింగ్ సరైందే అని ప్రజలు అనుకోవాలన్నది చంద్రబాబు కుట్ర అని వైసీపీ నిప్పులు కురిపిస్తోంది.
శవాలను, కళేబరాలను పీక్కుతినే వారిలా టీడీపీ వ్యవహరిస్తోందని ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే గీతాంజలి కుటుంబ సభ్యులను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అటు జగన్ కూడా ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజకీయంగా చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని.. ఒక అమాయకపు మహిళ ప్రాణాలు తీసిన చంద్రబాబుకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని వైసీపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ ఘటనలపై ఇప్పటి వరకు టీడీపీ-జనసేన మౌనంగా ఉండిపోయారే తప్ప మాట్లాడట్లేదు.





