Pawan Kalyan : పవన్ మీద కాపుల్లో తగ్గుతున్న అభిమానం.. అనుమానం పెరుగుతోందా…?

Qubetvnews - February 17, 2024 / 10:58 AM IST

Pawan Kalyan : పవన్ మీద కాపుల్లో తగ్గుతున్న అభిమానం.. అనుమానం పెరుగుతోందా…?

Pawan Kalyan  :

పవన్ కల్యాణ్‌ మీద రోజు రోజుకూ కాపుల్లో అభిమానం తగ్గుతోందని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ చేస్తున్న పనులే ఇందుకు నిదర్శనంగా ఉంటున్నాయి. ఏపీలో కాపుల సంఖ్య చాలా బలంగా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్‌ అన్ని విషయాల్లో కాపులను తగ్గిస్తున్నారు. అదే వారికి అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడితో పవన్ కల్యాణ్‌ పొత్తులు పెట్టుకున్నాడు. ఇది కాపులకు అస్సలు ఇష్టం లేదు. పైగా సీట్ల విషయంలో ప్రతిసారీ కాపులకు నిరాశే ఎదురవుతోంది.

ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో పవన్ కల్యాణ్‌, చంద్రబాబు చాలాసార్లు భేటీ అయ్యారు. కానీ పవన్ అడిగినన్ని గౌరవ ప్రదమైన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు మాత్రం సిద్దంగా లేరు. పవన్ కల్యాణ్‌ ఇప్పటికే పలుమార్లు 50 నుంచి 60 సీట్లు ఇవ్వాలని పలు వేదికల మీద చెప్పారు. కానీ వాస్తవంగా చంద్రబాబు అంత ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. పైగా తాజాగా నిన్న ఎల్లో మీడియాలో జనసేనకు 25 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్ మధ్య ఒప్పందం జరిగిందంటూ పెద్ద న్యూస్ వచ్చింది. కానీ దాన్ని జనసేన నుంచి ఒక్కరు కూడా ఖండించలేదు. దాంతో కాపుల్లో దీనిపై అనుమానం పెరుగుతోంది.

ఇక కాపు కురువృద్ధుడు అయిన హరిరామజోగయ్య కూడా పవన్ కు ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లు తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. 25 శాతం జనాభా మద్దతు ఉన్న జనసేనకు 4శాతం జనాభా ఉన్న కమ్మ పార్టీ ఇచ్చే సీట్లు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు కంటే పవన్ కు బలమైన సామాజిక వర్గం మద్దతు ఉంది. కానీ చంద్రబాబు ముందు పవన్ మోకరిల్లుతున్నారు. ఇదే ఇప్పుడు కాపులకు అస్సలు నచ్చడం లేదు. మంత్రి అంబటి రాంబాబు విమర్శించినట్టు సీట్లు తగ్గాయి కానీ ప్యాకేజీ తగ్గలేదనే అనుమానాలు కాపులకు కూడా వస్తున్నాయి.

పవన్ కల్యాణ్‌ కు జగన్ ను ఓడించడమే ముఖ్య ఉద్దేశం అయితే.. 2014 ఎన్నికల్లో లాగా పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇవ్వొచ్చు కదా.. అంతే గానీ ఇప్పుడు చంద్రబాబు కోసం తమకు సీట్లు తగ్గించి అవమానించడం ఏంటని మండిపడుతున్నారు. చంద్రబాబు ఇచ్చే ముష్టి తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

చంద్రబాబును గెలిపించేందుకు ఆయన ఇచ్చే తక్కువ సీట్లు తీసుకుని పని చేయడం జరగదని తేల్చి చెబుతున్నారు. ఇలా అన్ని రకాలుగా పవన్ మీద కాపుల్లో అసహనం పెరుగుతోంది. అంతే కాకుండా ఆయన మీద అభిమానం పూర్తిగా తగ్గిపోతూ వస్తోంది. దానిపై పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే నష్టమే అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News