Sidham Sabha : రోజు రోజుకీ పెరుగుతున్న మద్దతు.. సిద్ధం సభలకు పోటెత్తున్న జనాలు..!

Qubetvnews - April 15, 2024 / 07:57 PM IST

Sidham Sabha : రోజు రోజుకీ పెరుగుతున్న మద్దతు.. సిద్ధం సభలకు పోటెత్తున్న జనాలు..!

Sidham Sabha : రాష్ట్రంలో ఎన్నికల సమరం కీలకంగా ఉన్న సమయంలోనే ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనేది ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరి సభకు ఎంత మందిజనాలు వస్తున్నారనే దానిపైనే ప్రజాదరణ కనిపిస్తుంది. జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ఒకదానికి మించి మరొక సభకు జనాలు విపరీతంగా తరలి వస్తున్నారు. దాంతో రాష్ట్రంలో జగన్ గాలి వీస్తోందని అర్థం అవుతోంది. ఇప్పటికే రాయలసీమలో నిర్వహించిన సభలు ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. వాస్తవానికి జగన్ కు రాయలసీమలో బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సభలు సక్సెస్ అయ్యాయి కావొచ్చు అని ప్రతిపక్షాలు అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ సిద్ధం సభకు జనం సముద్రంలా తరలి వచ్చింది. రాయలసీమను మించి గుంటూరు, కృష్ణా ప్రజలు అభిమానం చూపిస్తున్నారని ఈ సభ నిరూపించింది. రాయలసీమలో నిర్వహించిన సభను మించి ఈ సభకు జనాలు వస్తున్నారంటే జగన్ బలం ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేతలు చెబతున్నారు. జగన్ పై రాళ్ల దాడి చేసి గాయపరిస్తే.. నీకు మేమంతా ఉన్నాం అని గుడివాడ సభకు ప్రజలు జనసందోహంగా తరలి వచ్చి మరీ మద్దతు తెలిపారు. దీన్ని బట్టి జగన్ కు ఎంత బలం ఉందనేది తెలుస్తోంది.

వాస్తవానికి జగన్ ను దెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలన్నీ కూటములుగా ఏర్పడి జగన్ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. కానీ ఆ యుద్ధంలో జగనే గెలుస్తున్నాడని వైసీపీ చెబుతోంది. ఎందుకంటే ఇంకో పక్క అల్లయ్యన్స్ స్టార్ క్యాంపెయినర్లు అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ఇంత జనబలం అక్కడ కనపడట్లేదు..

వారి సభలు ప్రజలు లేక వెలవెల బోతున్నాయి. కానీ జగన్ సభలకు మాత్రం జనాలు పోటెత్తుతున్నారు. ఇసుక వేస్తే రాలనంత జనాలు వస్తున్నారు. దాన్ని బట్టి జగన్ కు ఎంత మద్దతు పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News