Jagan : ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా రచ్చ.. రాహుల్ బాటలోనే జగన్..!
Qubetvnews - June 18, 2024 / 08:20 PM IST
Jagan : భారత్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై దేశంలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. సార్వత్రిక, పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంల పనితీరుపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. “అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈవీఎం లతో కాకుండా బ్యాలెట్ పాత్రలతో ఓటింగ్ చేపడుతున్నట్లు ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశ స్ఫూర్తిని నిలిపేందుకు మన దేశం కూడా ఆ విధానాన్ని అనుసరించాలి” అని ఆయన పేర్కొన్నారు. అయితే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై ఇదే జగన్ సంతృప్తి వ్యక్తం గమనార్హం.
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ evm లపై పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. దీనికి కారణం… ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఎన్నికల సరళిలో evm ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం.
ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మాస్క్ త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. ఈవీఎం విధానాన్ని రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. “ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడకూడదు. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టం కలిగిస్తుంది” అని ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.
భారత్ లోని పలువురు ప్రముఖ నాయకులు evm వ్యవస్థ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ ట్వీట్ ను ఉటంకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవీఎంలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని బ్లాక్ బాక్స్ లాంటివి అని, వాటిని పరిశీలించడానికి ఎవరికి ఇక్కడ అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఈవీఎం వ్యవస్థలో తారుమారు అవకాశాలు ఎక్కువ అని కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా తెలిపారు. సాఫ్ట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తనకు సుమారు 60 సంవత్సరాల అనుభవం ఉంది. ఈవీఎం విధానం, వ్యవస్థ పై నేను పనిచేశాను. ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయడం బదులు బ్యాలెట్ పత్రం విధానం సరైంది అని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా ఎన్నికలైన ప్రతిసారీ ఈవీఎంలపై చర్చ నడుస్తూనే ఉంది. ఓడిన పార్టీలు ఎలక్షన్ సరళి సరిగా లేకపోవడం, ఈవీఎంల పనితీరులో లోపల వల్లే ఓడిపోయాం అని వాదిస్తున్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల పనితీరులో ఎలాంటి తప్పు దోర్లట్లేదని, సరైన తీరులోనే ఎలక్షన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలుపుతున్నా, అక్కడక్కడ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విపక్ష నేతలు బ్యాలెట్ ఎలక్షన్ విధానాన్ని కోరుకుంటుండగా, ఈసీ, అధికార పక్షాలు ఈవీఎంలను సమర్ధిస్తున్నాయి.



