Jagan : భయమన్నది ఎరగని జగన్.. ఆ మాటల్లో తిరుగులేని ఆత్మవిశ్వాసం..!

Qubetvnews - March 11, 2024 / 09:20 AM IST

Jagan : భయమన్నది ఎరగని జగన్.. ఆ మాటల్లో తిరుగులేని ఆత్మవిశ్వాసం..!

Jagan : ఆ కండ్లలో బెదురు లేదు.. ఆ మాటల్లో వణుకు లేదు.. నిలువెల్లా ఆత్మవిశ్వాసంతో కనిపించారు జగన్. మాటలతో హోరెత్తించి.. కార్యకర్తల్ని కదనరంగానికి సిద్ధం చేస్తూ ముందుకు సాగిపోయారు. ఇది నిన్నటి అద్దంకిలో జగన్ కనిపించిన తీరు. ఐదేండ్ల తన పాలన మీద జగన్ కు ఎంత నమ్మకం ఉందో ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చి పోటీ చేస్తున్నా సరే ఒంటరి పోరులో జగన్ అస్సలు భయపడట్లేదు. మరింత ఆత్మవిశ్వాసంతోనే కనిపిస్తున్నారు జగన్. ఇప్పుడు టీడీపీ -జనసేన కలిసిపోయాయి. అంతే కాకుండా బీజేపీ కూడా ఇప్పుడు పొత్తులకు రెడీ అయిపోయింది.

అటు నుంచి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని వస్తోంది. ఇంత మంది కూడగట్టుకుని వస్తున్నా సరే జగన్ మాత్రం అస్సలు వెనక్కు తగ్గట్లేదు. తనకు తిరుగులేదని ఇప్పుడు నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే మూడు సభలు పెడితే మూడు ఒకదాన్ని మించి మరొకటి పెద్ద సక్సెస్ అయ్యాయి. ఇక వాటిని తలదన్నేలా నిన్నటి అద్దంకి సభ సూపర్ సక్సెస్ అయిపోయింది. దాదాపు పదిన్నర లక్షల మంది వచ్చి సభను సక్సెస్ చేశారు. అక్కదకు వచ్చిన వారిని, తన స్పీచ్ ను టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తున్న వారిని జగన్ ఏ మాత్రం నిరాశ పర్చలేదు.

మరింత హుషారుగా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ఏకి పారేశారు. ప్రతిపక్షాలకు సైన్యాధిపతులు ఉన్నారు గానీ.. సైన్యం లేదంటూ సెటైర్లు వేశారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకున్న చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీలో పడగాపులు కాస్తూ తన సైకిల్ ను ముందుకు తోసే వారని తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మన ఫ్యాన్ తిరగాలంటే పవర్ ప్రజల నుంచి వస్తుంది. కానీ సైకిల్ ముందుకు నడవాలంటే మాత్రం దాన్ని ఎవరో ఒకరు వెనక నుంచి తోయాలి అంటూ కౌంటర్లు వేశారు జగన్. అక్కడితో ఆగిపోలేదు. రాబోయే ఎన్నికలు పద్మవ్యూహం అయితే తాను అర్జునుడిని అంటూ హోరెత్తించారు.

వైసీపీ విరగకాచిన మామిడి చెట్టులా ఉంటే.. టీడీపీ మాత్రం చదలు పట్టి ఎండిపోయిన చెట్టులా మారిందంటూ సెటైర్లు వేశారు. సైకిల్ తుప్పుపట్టి పోతోందని.. కాబట్టి దాన్ని వాడటం మంచిది కాదంటూ తెలిపారు. అటు పవన్ కల్యాణ్‌ ఎంత తోసినా సైకిల్ ముందుకు కదలట్లేదని.. అందుకే ఇప్పుడు బీజేపీని తోయడానికి తెచ్చుకుంటున్నారని సెటైర్లు వేశారు.

ఎంత మంది వచ్చినా సరే వైసీపీని మాత్రం ఓడించలేరని చెప్పుకొచ్చారు సీఎం జగన్. ఇలా అద్దంకి సభలో జగన్ మాటల్లో ఆత్మవిశ్వాసం బలంగా కనిపించింది. అంతే కాకుండా ఆయన మాటల్లో ఎక్కడా కూడా నిరాశ, నిరుత్సాహం కనిపించలేదు. దీన్ని బట్టి రాబోయే ఎన్నికల్లో తన గెలుపుపై జగన్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News