Jagan : కలిసొచ్చిన పనే చేయబోతున్న జగన్..?
Qubetvnews - June 18, 2024 / 08:15 PM IST
Jagan : వైఎస్ జగన్ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉంటే ఆ జోష్ మామూలుగా ఉండదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలో ఉంటే నిత్యం జనాల్లోనే ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీని నిద్ర కూడా పోనివ్వరనేది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కనిపించింది. ఇక ఈ గడిచిన ఐదేండ్లు ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేకపోయారనే టాక్ ఉంది. ఎందుకంటే జగన్ కుటుంబం నుంచి ఎవరూ పార్టీలో లేరు. జగన్ ఒక్కడే అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని చూసుకోవాల్సి వచ్చింది.
అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఈ ఐదేండ్లు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వానికే పెద్ద పీట వేశారు. పార్టీని పెద్దగా పట్టించుకోలేకపోయారు. అందుకే పార్టీ చాలా వరకు అస్తవ్యస్థంగానే తయారైంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీలో చాలా వర్గాలు ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నాయి. అది ఇప్పుడు జగన్ కు బాగా అర్థం అయింది. అందుకే ఇప్పుడు ఓడిపోయిన వెంటనే పార్టీ మీద ఫోకస్ మళ్లించారు. గతంలో తనకు కలిసి వచ్చిన పనులనే మళ్లీ చేయాలని డిసైడ్ అవుతున్నారు జగన్. మొన్న వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. పార్టీని మళ్లీ బలపేతం చేసేందుకు కావాల్సిన అంశాలను వారి నుంచి సేకరించారు. అంతే కాకుండా ఇప్పుడు టీడీపీ మూకల దాడిలో గాయపడ్డ వైసీపీ నేతలను, కార్యకర్తలను ఆయన పరామర్శించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గతంలో ఆయనకు పరామర్శలే ప్రజల్లే, పార్టీలో బలాన్ని పెంచాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ పరామర్శలు చేసి.. తాను కార్యకర్తలకు దగ్గర కావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు త్వరలోనే పరామర్శలు ఉంటాయని అంటున్నారు.
దాంతో పాటు పాదయాత్రలు కూడా చేసే ఆలోచనలో ఉన్నారంట జగన్. తనను గతంలో పాదయాత్రనే గెలిపించింది కాబట్టి ఇప్పుడు మళ్లీ అదే పాదయాత్రను రాబోయే ఐదేండ్ల కాలంలో చేయాలని అనుకుంటున్నారంట. కాకపోతే దానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.



