YS Jagan : జగన్ దెబ్బకు కిందకు దిగిన పవన్, చంద్రబాబు..!

Qubetvnews - February 24, 2024 / 11:42 AM IST

YS Jagan : జగన్ దెబ్బకు కిందకు దిగిన పవన్, చంద్రబాబు..!

YS Jagan :

పవన్ కల్యాణ్‌, చంద్రబాబులు మొన్నటి వరకు తమకు తిరుగులేదని అనుకున్నారు. మాకేంటి పొత్తులు పెట్టేసుకున్నాం.. ఇక జగన్ ఓటమి ఖాయం అన్న రేంజ్ లో మాట్లాడారు. కానీ ఎప్పుడైతే జగన్ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. సిద్ధం సభలను పెడుతున్నారో.. ఒక్కసారిగా వైసీపీ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రజల్లో వైసీపీకి తిరుగులేని పట్టు ఉందని సిద్ధం సభలతో తేలిపోయింది. దాంతో ఇప్పట్లో వైసీపీని ఢీ కొట్టాలంటే మరిన్ని శక్తులు కూడగట్టాలని టీడీపీ, జనసేనలు భావించాయి. ఇందులో భాగంగా బీజేపీని కలుపుకుని పోయేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నాయి.

కానీ జగన్ మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే.. జగన్ అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇంకో వైపు సిద్ధం సభలతో మీరు సిద్ధమా అని ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు వరుసగా నియోజకవర్గాల్లో ప్రచారాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. దాంతో టీడీపీ, జనసేన పార్టీలు నిరాశలో ఉన్నాయి. ఇంకా అభ్యర్థుల ప్రకటనే కాలేదు.. ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారంటూ అడుగుతున్నారు. దాంతో ఇలా అయితే వైసీపీని ఢీకొట్టలేమని టీడీపీ, జనసేనలు భావిస్తున్నాయి.

అందుకే ఇప్పుడు టీడీపీ, జనసేనలో జోష్ నింపకపోతే చాలా ప్రమాదం ఎదురవుతుందని వారు భావించారు. ఎందుకంటే ఆలస్యం చేస్తే
అమృతం కూడా విషం అవుతుందని వారికి తెలుసు. ఇప్పటికే టీడీపీ, జనసేన అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇలాగే లేట్ చేస్తే అభ్యర్థులను ప్రకటించినా సరే జోష్ రాదని వారికి అర్థం అయింది. అందుకే ఎట్టకేలకే ఈ రోజు అంటే శనివారం కొంత మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించాలని వారు డిసైడ్ అయ్యారు. ఇందుకోసం కొత మంది పేర్లతో ఓ లిస్టును రెడీ చేసుకున్నారు. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు, పవన్ లు ఓ ప్లాన్ వేసుకున్నారు.

అదేంటంటే మొదటి లిస్టులో ఎలాంటి గొడవలు లేని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండే వారి పేర్లను ప్రకటించబోతున్నారు. ఎందుకంటే మొదటి లిస్టులోనే గొడవలు అయితే పరువు పోతుందని వారు భావిస్తున్నారు.

అందుకే ఈ లిస్టులో పవన్, చంద్రబాబు, లోకేష్, నాగబాబు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు లాంటి కీలక నేతల పేర్లతో లిస్టును రెడీ చేసుకున్నారు. అయితే ఈ లిస్టుతో పెద్దగా ప్రాబ్లమ్ రాకపోవచ్చు. కానీ తర్వాత ప్రకటించే లిస్టులతో మాత్రం రెండు పార్టీల్లో రచ్చ రచ్చ కావడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News