Pawan Kalyan : డబ్బులు పంచడానికి సిద్ధమైన పవన్.. కొత్త రకం రాజకీయాలు ఏమయ్యాయి..?

Qubetvnews - February 22, 2024 / 03:10 PM IST

Pawan Kalyan : డబ్బులు పంచడానికి సిద్ధమైన పవన్.. కొత్త రకం రాజకీయాలు ఏమయ్యాయి..?

Pawan Kalyan : 

పవన్ కల్యాణ్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎప్పుడు ఆ మాటలను దాటవేస్తారో కూడా తెలియదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఏదో పెద్ద సమాజాన్ని ఉద్దరించే వ్యక్తిలాగా పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం.. తర్వాత ఆయన మాటలను ఆయనే దాటవేడయం లాంటివి ఎప్పటి నుంచో ఏపీ జనాలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తన మాటలను తానే వక్రీకరించేశారు పవన్ కల్యాణ్‌. అసలు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఏం చెప్పారు.. నేను కొత్త రకం రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చాను.

రాజకీయాల్లో, సమాజంలో మార్పు కోసమే పార్టీ పెట్టాను. ఎలాంటి అవినీతి లేకుండా పాలన అందిస్తాను. ఎలాంటి డబ్బులు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ తెలిపారు పవన్ కల్యాణ్‌. తన పార్టీ నుంచి పోటీ చేసే వారు కూడా ఎలాంటి డబ్బులు పంచరంటూ తెలిపారు పవన్. అలాంటిది ఇప్పుడు ఎందుకో మాట మార్చేస్తున్నారు. తాజాగా ఆయన భీమవరంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని తెలిపారు. ఎన్నికల్లో ఓట్లు కొంటారో లేదో మీరే నిర్ణయించుకోవలంటూ పార్టీ నేతలకు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ను ఇందుకు ఉదహరిస్తున్నారు.

ఎన్నికల కమిషన్ కూడా ఖర్చు పరిమితిని రూ.45లక్షల వరకు పెంచిందని తెలిపారు. కాబట్టి ఎన్నికల్లో డబ్బులు పంచండి అంటూ బహిరంగంగానే ప్రకటించడం అందరికీ ఆశ్చర్యంగా మారిపోయింది. అంటే పవన్ చెప్పినవన్నీ ఉత్త సిద్ధాంతాలేనా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏదో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి చివరకు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇంకొందరు అయితే పవన్ కల్యాన్‌ చెబుతారు గానీ.. అస్సలు పాటించబోరు అంటూ సెటైర్లు వేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ ప్రజలను మోసం చేసేందుకే ఇలాంటి కామెంట్లు చేస్తారు.

అంతే తప్ప ఆయన మాత్రం అస్సలు పట్టించుకోరు, పాటించరు అని చెబుతున్నారు. ఇన్ని రోజులు పవన్ కల్యాణ్‌ ను నమ్మి, ఆయన చెప్పిన మాయ మాటలను నమ్మి ప్రజలు మోసపోయారని.. ఇప్పటికైనా జనసైనికులు కండ్లు తెరవాలని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పవన్ ఇంకెలా వ్యవహరిస్తారో ఆలోచించుకోవాలని చెబుతున్నారు.

పవన్ కల్యాణ్‌ కు నిజంగా చిత్త శుద్ధి ఉంటే ఒకే మాట మీద ఉండాలి గానీ.. ఇలా పూటకో మాట.. అవసరానికో పాట పాడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ కు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ ఎన్నికల్లో పవన్ ను ఓడించి బుద్ధి చెప్పాలంటూ కోరుకుతున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News