TDP Rebels : జనసేనను వణికిస్తున్న టీడీపీ రెబల్స్.. పొత్తులున్నా గెలుస్తారా..?

Qubetvnews - February 20, 2024 / 09:05 PM IST

TDP Rebels : జనసేనను వణికిస్తున్న టీడీపీ రెబల్స్.. పొత్తులున్నా గెలుస్తారా..?

TDP Rebels :

పాపాం.. జనసేన పరిస్థితి ఎలా ఉందంటే.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లే శనే అన్నట్టు తయారైంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఇన్ని రోజులు ఎలాంటి సీట్లు లేవు. పార్టీ పెట్టి పదేండ్లు అవుతున్నా సరే ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. ఇంత వరకు పవన్ కల్యాణ్‌ కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దాంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలని పవన్ కల్యాణ్‌ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సారి గనక గెలవలేకపోతే ఇక పవన్ కు రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు.

జనసైనికులకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా సరే చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నారు పవన్. ఒంటరిటీ పోటీ చేస్తే గెలవలమేని పవన్ కు తెలుసు. కాబట్టి పొత్తులో భాగంగా టీడీపీ మద్దతుతో తమ పార్టీకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు అయినా రాకపోతాయా అనే ఆశలు పెట్టుకున్నారు పవన్ కల్యాణ్‌. కానీ ఇప్పుడు ఆయన్ను టీడీపీ రెబల్స్ భయపెట్టేస్తున్నారు. వాస్తవానికి జనసేనకు అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేరు. ఇంకా చెప్పాలంటే టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తున్న వారు, గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఆశావహులు ఇలా చాలా మందే ఉన్నారు.

ఇప్పుడు గనక టీడీపీకి టికెట్ కేటాయించకుండా జనసేనకు ఇస్తే వారు ఊరుకునే ప్రసక్తి లేదని చెబుతున్నారు. తమకు టికెట్లు రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీ చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. అదే ఇప్పుడు జనసేనకు గుబులు రేపుతోంది. ఎందుకంటే టీడీపీ నుంచి రెబల్స్ పుట్టుకొస్తే ఓట్లు కచ్చితంగా చీలిపోతాయి. కాబట్టి జనసేన గెలుపు ఆశలపై నీళ్లు చల్లినట్టే అవుతోంది. టీడీపీకి పడే ఓట్లు కూడా రెబల్స్ కు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీ ఓట్లు జనసేనకు మళ్లే అవకాశాలు చాలా తక్కువ. దాంతో పొత్తులు పెట్టుకున్నా సరే జనసేన అభ్యర్థులు గెలుస్తారనే నమ్మకం లేదు.

కాబట్టి ఈ సారి జనసేన పొత్తులు పెట్టుకున్నా సరే చాలా చోట్ల టీడీపీ రెబల్స్ కారణంగా ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు రాజకీయి నిపుణులు. ఇది జనసేనకు భారీ దెబ్బ అనే చెప్పుకోవాలి. టీడీపీకి పడే ఓట్లు పొత్తులో భాగంగా తమకు మళ్లితే జనసేన ఓట్లు ఇతర చోట్ల టీడీపీకి పడుతాయని పవన్ చెబుతున్నారు.

కానీ జనసేనకు టికెట్ ఇవ్వని చోట ఆ పార్టీ నుంచి రెబల్స్ వచ్చే అవకాశాలే లేదు. కానీ జనసేనకు టికెట్ ఇచ్చిన చోట మాత్రం టీడీపీ నుంచి రెబల్స్ పుట్టుకొచ్చే ప్రమాదం మాత్రం ఉంది. అంటే పొత్తుల వల్ల టీడీపీకి పెద్దగా నష్టం లేదు గానీ.. జనసేనకు మాత్రం ఎంతో కొంత నష్టం తప్పదని అంటుననారు. చూడాలి మరి దీన్ని పవన్ ఎలా ఎదుర్కుంటారో.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News