TDP Sitting MLAs : జనసేనను భయపెడుతున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు..!

Qubetvnews - February 18, 2024 / 07:16 PM IST

TDP Sitting MLAs : జనసేనను భయపెడుతున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు..!

TDP Sitting MLAs :

పవన్ కల్యాణ్‌ ఏదో ఆశించి టీడీపీతో ఎగబడి మరీ పొత్తులు పెట్టుకున్నాడు. ఎన్డీయేలో ఉంటూనే ఆయన టీడీపీతో పొత్తులకు ఓకే చెప్పేశారు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యం అని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దనే ఉద్దేశంతోనే తాను టీడీపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నట్టు చెప్పారు. కానీ టీడీపీతో పొత్తుల వెనక పవన్ కల్యాణ్‌ అసలు ఉద్దేశం వేరే ఉంది. అదేంటంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కనీసం తాను కూడా గెలిచే పరిస్థితి లేదని పవన్ కల్యాణ్‌ కు బాగా తెలుసు. ఇప్పటి వరకు జనసేనలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఈ ఎన్నికల్లో గనక ఓడిపోతే ఇక పవన్ కు రాజకీయ భవిష్యత్ ఉండదు.

ఆయన ఒక్కడు గెలిస్తే సరిపోదు.. కనీసం పది కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అయినా గెలవాలనే ఆశ పెట్టుకున్నాడు పనవ్ కల్యాన్‌. టీడీపీతో పొత్తుల కారణంగా ఆ పార్టీకి పడే ఓట్లు అన్నీ తన పార్టీకే పడుతాయన్నది ఆయన ఆశ. కానీ ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేనను వణికిస్తున్నారు. ఈ నడుమ ఒక్కొక్క ఎమ్మెల్యే బహిరంగం గానే ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తామని చెప్పారని.. ఒకవేళ తమకు గనక ఇవ్వకపోతే జనసేనకు మద్దతు ఇచ్చే పరిస్థితులు అస్సలు ఉండవని చెబుతున్నారు.

క్షేత్ర స్థాయిలో టీడీపీ కేడర్ బలంగా ఉందని.. కాబట్టి టీడీపీ కేడర్ ఎట్టి పరిస్థితుల్లో జనసేనతో కలవబోరంటూ ప్రకటిస్తున్నారు. అంతే కాకుండా టీడీపీ గెలుస్తుందనే నమ్మకం ఉన్న సీట్లను కూడా జనసేనకు ఇవ్వొద్దంటూ కొందరు కీలక నేతలు చెబుతున్నారు. టీడీపీలో కొమ్ములు తిరిగిన నేతలుగా పేరు తెచ్చుకున్న వారందరూ తమ అనుచరులు, వారసుల కోసం టికెట్లు కావాలని చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు. తమకు ఇస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తామని తేల్చి చెబుతున్నారు. తమకు ఇవ్వకుండా పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే మాత్రం ఊరుకునేది లేదంటున్నారు.

ఇలా టీడీపీ నేతలు అందరూ జనసేనకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ ఏదో ఆశపడి టీడీపీ పార్టీతో పొత్తులు పెట్టుకుంటే.. ఇప్పుడు తమకు ఇలాంటి హెచ్చరికలు రావడంతో పవన్, జనసైనికులు నిరాశ చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల్లో టీడీపీ సీట్లను జనసేనకు ఇస్తే అక్కడ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు.

టీడీపీ కేడర్ తమకు సహకరించకపోతే గెలిచే పరిస్థితులు లేవని జనసేన ఆశావహులు చెబుతున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్‌ కు చంద్రబాబు సీట్లు ఇచ్చినా సరే టీడీపీ నేతలు, కేడర్ మాత్రం షాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు పరిస్థితులు ఇంకెలా ఉంటాయో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News