V.Khadar Bhasha : రద్దుకు బీజేపీ కుట్ర.. మరి బాబు మాట ఏంటో?
Qubetvnews - April 25, 2024 / 07:22 AM IST
V.Khadar Bhasha :
దేశంలో ఉన్న ముస్లీం రిజర్వేషన్ లను రద్దు చేయడం కోసం బీజేపీ నాయకత్వం సిద్ధం అవుతున్నట్లుగా వైకాపా నాయకుడు మైనార్టీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ రద్దు చేసే విషయమై పరిశీలిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఖాదర్ భాషా మరియు ఇతర ముఖ్యమైన వైకాపా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ సందర్భంగా ఖాదర్ భాషా మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. బీజేపీ నిర్ణయం పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యం ఏంటి అంటూ ఖాదర్ భాషా ప్రశ్నించాడు. ముస్లీం రిజర్వేషన్ లకు లోకేష్ తీరు ఏంటి అంటూ ఖాదర్ భాష పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు ఉన్న నీటిలో నాచ్చాల్సిన అవసరం ఉంది.
ముస్లీం రిజర్వేషన్ కి సంబంధించిన చర్చల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు ముస్లీం రిజర్వేషన్ ల విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది చెప్పాలంటూ ఖాదర్ భాషా డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు దమ్ము ఉంటే ప్రధాని మోడీ మరియు అమిత్ షా ల వద్దకు వెళ్లి రిజర్వేషన్ లు ఆపకూడదు అంటూ వారితో ఒక మాట చెప్పించగల సత్తా ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారు.





