Congress : బీఆర్ఎస్ లో రెండు వర్గాలను టార్గెట్ చేసిన కాంగ్రెస్.. మూడో వర్గం అప్పుడేనా..?

Qubetvnews - February 17, 2024 / 08:23 AM IST

Congress : బీఆర్ఎస్ లో రెండు వర్గాలను టార్గెట్ చేసిన కాంగ్రెస్.. మూడో వర్గం అప్పుడేనా..?

Congress :

పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడేం కొత్త కాదు. అవి గతంలో నుంచే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ ఇదే కామెంట్లు చేసింది. బీఆర్ ఎస్ లో పేరు మోసిన నేతలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తామని.. ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దాంతో ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమపై బీఆర్ ఎస్ టార్గెట్ పెట్టక ముందే.. తామే బీఆర్ఎస్ మీద టార్గెట్ పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ లో రెండు వర్గాలను టార్గెట్ చేశారు.

అందులో ఒకటి స్థానిక సంస్థల నేతలు. అంటే చాలా వరకు మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ వశం అవుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు చాలా వరకు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. కానీ వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఆచలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. దాంతో చాలా వరకు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయి. చాలా మంది కౌన్సిలర్లు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. మొన్ననే షురూ అయిన ఈ జంపింగ్ లు.. ఇప్పుడు మరీ ఎక్కువ అవుతున్నాయి. దాంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

కాగా ఇంకో వర్గం అయిన ఎంపీలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ అయిన వెంకటేశ్ నేతకాని డైరెక్టుగా వెళ్లి ఢిల్లీలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయనను చూసి మరికొందరు బీఆర్ఎస్ ఎంపీలు కూడా కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఇలా రెండు వర్గాలను కాంగ్రెస్ ఇప్పుడు టార్గెట్ చేసినట్టు అయిపోయింది. మరి మూడో వర్గం ఎప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడో వర్గం అంటే ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలను ఇప్పుడు కాంగ్రెస్ లాక్కునే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

త్వరలోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉంటాయి. అది కాస్త ఎంపీ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేల జాయినింగ్ ఉండబోదని తెలుస్తోంది.

కానీ ఎంపీ ఎన్నికల తర్వాత మాత్రం బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వారందరూ ఇప్పటికే రేవంత్ వర్గంతో చర్చలు జరిపి రెడీగా ఉన్నారనే సమాచారం కూడా అందుతోంది. మరి ఎంపీ ఎన్నికల తర్వాత ఎవరెవరు బీఆర్ ఎస్ ను వీడుతారనేది మాత్రం చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News