Telugu News » Tag » kavitha arrest
Kavitha : బీఆర్ ఎస్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇదే నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే బీఆర్ ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. అటు కేసీఆర్ కాలు విరిగి ఇంటికే పరిమితం కావడంతో పార్టీకి కేసీఆర్ అందుబాటులో లేకుండా పోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ తప్పులను వెతికి మరీ ప్రజల ముందు పెట్టే […]
KTR : తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకోవాల్సి వస్తే.. ముందుగా కేటీఆర్ గురించే చెబుతారు బీఆర్ ఎస్ నేతలు. ఎందుకంటే రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయికి ఎదిగిన వ్యక్తి కేటీఆర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ ను మించేలా అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తుంటారు. మాటలో గానీ.. రాజకీయంలో గానీ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గానీ.. సబ్జెక్ట్ లో గానీ కేసీఆర్ ను ఏ మాత్రం తీసిపోరు కేటీఆర్. అందుకే కేటీఆర్ కు బీఆర్ ఎస్ లో […]
KCR : కేసీఆర్ అంటే రాజకీయాల్లో తల పండిన నేత. ఎప్పుడు ఎలా స్పందించాలో.. ఎలాంటి రాజకీయాలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన్ను రాజకీయ చాణక్యుడు అని పిలుస్తుంటారు ఆయన గురించి తెలిసిన వారు. గత పదేండ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ కు.. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే కేసీఆర్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి […]
KCR : మాజీ సీఎం కేసీఆర్ కు అన్ని విధాలుగా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం మీద పెద్ద ఎత్తున నానా రచ్చ చేసింది. అసెంబ్లీలో చర్చ, మేడిగడ్డ సందర్శన, ఆ తర్వాత అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో నానా బీభత్సం సృష్టించింది. కానీ ఆ ఆరోపణలను బీఆర్ ఎస్ గానీ, కేసీఆర్ గానీ బలంగా తిప్పికొట్టలేకపోయారు. అంతే […]
Kavitha : మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఒక్క రాష్ట్రానికి పరిమితమైన విషయం కాదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు చెందిన కీలక లీడర్లు ఇప్పుడు ఇందులో ఇరుక్కుంటున్నారు. అయితే కవిత అరెస్ట్ పై చాలా కాలంగా సస్పెన్స్ నెలకొంది. కానీ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు బీఆర్ ఎస్ […]
Kavitha : మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. చాలా రోజులుగా కవిత అరెస్ట్ పై ఊహాగానాలు వస్తున్నాయి. కానీ చివరకు అనుకున్నట్టు గానే.. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒక రోజు ముందు కవిత అరెస్ట్ సంచలనం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందనేది సీబీఐ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి.. అందులో నిజంగానే కవిత పాత్ర ఉందా లేదా అనేది […]