Kavitha : కవిత అరెస్ట్ పై బీఆర్ ఎస్ కొత్త ప్రచారం.. వర్కౌట్ అవుతుందా..?

Qubetvnews - March 27, 2024 / 09:33 AM IST

Kavitha : కవిత అరెస్ట్ పై బీఆర్ ఎస్ కొత్త ప్రచారం.. వర్కౌట్ అవుతుందా..?

Kavitha : బీఆర్ ఎస్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇదే నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే బీఆర్ ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. అటు కేసీఆర్ కాలు విరిగి ఇంటికే పరిమితం కావడంతో పార్టీకి కేసీఆర్ అందుబాటులో లేకుండా పోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ తప్పులను వెతికి మరీ ప్రజల ముందు పెట్టే పని పెట్టుకున్నారు. కాలేశ్వరంలో అవినీతి అంటూ, మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని.. బీఆర్ ఎస్ అవినీతి చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేశారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. అది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి కేసులో జైలుకు వెళ్లింది లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ కూతురు జైలుకు వెళ్లడం అంటే ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవడమే అని అంటున్నారు. అటు జాతీయ మీడియా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దాంతో ఇప్పుడు నేషనల్ వైడ్ గా బీఆర్ ఎస్ కు, కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతోంది. అయితే ఇప్పుడు దాన్ని కొంత వరకు అయినా కవర్ చేసే పనిలో పడ్డారు కేసీఆర్.

ఈ క్రమంలోనే కవిత అరెస్ట్ విషయంలో కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెస్తున్నారు. అదేంటంటే.. కవితను ఈడీ తప్పుగా అరెస్ట్ చేసిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా హరీశ్ రావు తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. కవిత తప్పుచేయకున్నా అరెస్ట్ చేశారని ఆరోపించారు. బీజేపీతో పొత్తుకు తాము నిరాకరించినందుకే కవితను కక్ష పూర్వకంగా అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఒకవేళ తాము బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఉంటే మాత్రం కవిత అరెస్ట్ అయ్యేది కాదని చెప్పుకొచ్చారు. అంటే ఈ వ్యాఖ్యల వెనక అర్థం బలంగానే ఉంది.

బీజేపీతో తాము పొత్తులకు నో చెప్పినందుకే ఇప్పుడు తమను వేధిస్తున్నారంటూ బీఆర్ ఎస్ ఈ ప్రచారాన్ని తెరమీదకు తెస్తోంది. కానీ మొన్నటి వరకు ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పుడు అదును చూసి తెరమీదకు కొత్త విషయాన్ని తెస్తున్నారంటే దాని వెనకాల ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు.

అంటే కవిత మీద వస్తున్న ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ఇలాంటి వ్యూహాన్ని బీఆర్ ఎస్ ఎత్తుకుందని చెబుతున్నారు రాజకీయ నిపుణులు. ఇది ఒక రకంగా కవిత మీద వస్తున్న వ్యతిరేకతను కొంత వరకైనా తగ్గించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News