KCR : కవిత అరెస్ట్.. కేసీఆర్ మౌనం వెనక వ్యూహం వేరే ఉందా..?

Qubetvnews - March 21, 2024 / 09:28 AM IST

KCR : కవిత అరెస్ట్.. కేసీఆర్ మౌనం వెనక వ్యూహం వేరే ఉందా..?

KCR : కేసీఆర్ అంటే రాజకీయాల్లో తల పండిన నేత. ఎప్పుడు ఎలా స్పందించాలో.. ఎలాంటి రాజకీయాలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన్ను రాజకీయ చాణక్యుడు అని పిలుస్తుంటారు ఆయన గురించి తెలిసిన వారు. గత పదేండ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ కు.. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే కేసీఆర్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే పని పెట్టుకుంది.

కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ ఎస్ నుంచి బలమైన కౌంటర్ వెళ్లట్లేదనే వాదన కూడా ఉంది. అటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని.. ఇలా రకరకాల విషయాల్లో కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు అది సరిపోదు అన్నట్టు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది. దాంతో ఇది కేసీఆర్ గ్రాఫ్‌ ను మరింత డ్యామేజ్ చేస్తోంది. అయితే ఇలాంటి సమయంలో కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నారు. ఇదే ఇప్పుడు బీఆర్ ఎస్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ మౌనంగా ఉంటే.. కవిత తప్పు చేసిందని ఒప్పుకున్నట్టు అయిపోతుందనేది వారివాదన. అయితే కేసీఆర్ ఏ కారణం లేకుండా ఇలా తన సొంత కూతురు అరెస్ట్ అయినా కూడా మౌనంగా ఉండరు కదా. ఆయన ఏదో ఒక వ్యూహంలో భాగంగానే ఇలా మౌనంగా ఉండిపోతారనేది ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. ఇప్పటికే కవిత అరెస్ట్ మీద బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అయితే ఇప్పుడు కవితకు బెయిల్ కోసం బీఆర్ ఎస్ సిన్సియర్ గా ప్రయత్నాలు చేస్తోంది. కేటీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు.

త్వరలోనే కవితను బెయిల్ మీద బయటకు తీసుకురావాలనేది కేసీఆర్ ఆలోచన. లిక్కర్ కేసులో కవిత నేరుగా దోషి అని చెప్పడానికి పెద్దగా సాక్ష్యాలు లేవు. కాబట్టి ఇదే అంశంపై బెయిల్ తీసుకువస్తే మాత్రం అప్పుడు కచ్చితంగా కేసీఆర్ మాట్లాడేందుకు అవకాశాలు ఉంటాయనేది బీఆర్ ఎస్ ఆలోచనగా తెలుస్తోంది.

ఎంపీ ఎన్నికల్లోపే కవితను బయటకు తీసుకువచ్చి బీజేపీ తమను టార్గెట్ చేస్తోందని కేసీఆర్ ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం రాజకీయంగా అన్ని వ్యూహాలను రెడీ చేసుకుంటున్నారంట. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News