Bandi Sanjay : నా మాట.. నా బాట.. నా ప్రతి పయనం అంతా ప్రజల కోసమే : బండి సంజయ్
Qubetvnews - May 5, 2024 / 10:40 AM IST
Bandi Sanjay :
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో తనదైన మాటల తూటాలు పేల్చుతూ దూసుకు పోతున్నారు. మరోసారి బండి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టడం కన్ఫర్మ్ అంటూ ఇప్పటికే సర్వే ఫలితాలు వచ్చాయి. దాంతో మరింత జోష్ తో బండి సంజయ్ ప్రచారం లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బండి సంజయ్ వివిధ సభలు మరియు రోడ్ షో ల్లో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. బీజేపీతోనే దేశం అభివృద్ది సాధ్యం అని, రిజర్వేషన్ లను కొనసాగించడం బీజేపీకే సాధ్యం అన్నారు. ఇంకా బండి మాట్లాడుతూ… అభివృద్ధిలో ముందు ఉంటా.. ఆపదొస్తే ఆదుకుంటా.. కష్టాల్లో తోడుంటా.. ఆత్మీయుడిలా మీ వెంటే ఉంటా.. నా మాట.. నా బాట.. నా ప్రతి పయనం అంతా ప్రజల కోసమే
నా గెలుపు మీ కోసమే.. మీకు అండగా ఉండడం కోసమే అన్నారు.
శనివారం భారతీయ జనతా మహిళా మోర్చా నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో బండి పాల్గొన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అనిర్వచనీయం. మహిళలను రాష్ట్రపతిగా, కీలక శాఖలకు మంత్రులను చేసిన ఘనత మోదీ గారి ప్రభుత్వానిది. మహిళలకు 33 శాతం రిజ్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మోదీ గారి చొరవ వల్ల అతి త్వరలో మహిళల చేతికి అధికార పగ్గాలు రాబోతున్నాయి. నారీ శక్తి పవర్ ఏంటో రాబోయే రోజుల్లో చూడటం తథ్యం. బీఆర్ఎస్ పాలన అంటే గుర్తుకు వచ్చేది అత్యాచారాలు అరాచకాలు అవినీతి. కాంగ్రెస్ ది కూడా అదే పంథా. మహిళలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది. ఆ పార్టీకి ఓటేస్తే ఇక భస్మాసురా హస్తమే అన్నారు.

Bandi Sanjay Criticizing Congress Party
రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తొలగిస్తామన్నందుకు బీజేపీ రాజ్యాంగాన్నే మార్చబోతోందని, బీజేపీ నేతలను ఏ చెప్పుతో కొట్టాలని అంటున్నడు.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లకుపైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.20 లక్షలిచ్చారని, అందులో రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాలో జమైనట్టు చర్చ జరుగుతోందన్నారు. తక్షణమే బ్యాంకు లావాదేవీలపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టడంతో పాటు డబ్బు తీసుకున్న, ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘నేను పక్కా లోకల్. మీరు తయారు చేసిన కార్యకర్తను. మీ కోసం పోరాటాలు చేశా. కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లు తీసుకొచ్చాను. మరి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు మీకోసం ఎన్నడైనా పనిచేశారా? వాళ్లు నాన్ లోకల్. కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీని ఎత్తేస్తారు’ అని అన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవని, కాంగ్రె్‌సకు ప్రధాని అభ్యర్థి కూడా లేడని చెప్పారు. కేసీఆర్ ఎప్పటికీ ప్రధాని కాలేరని, అలాంటి వారికి ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.

Bandi Sanjay Criticizing Congress Party
‘సెక్యులర్’ అనే పదం అంబేడ్కర్ రాజ్యాంగంలో లేదని, కాంగ్రెస్ ఆ పదాన్ని ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రాజ్యాంగంలోకి తెచ్చిందన్నది వాస్తవం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ పదాన్ని తీసేస్తే తప్పేంటన్నారు. ‘మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఇకపై రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఎవరైనా అంటే చీపురు, చెప్పులతో ఉరికించి కొట్టాలి. రాముడిని, రాముడి అక్షింతలను హేళన చేయడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమే.. కేసీఆర్ బలుపెక్కి దేవుడి తీర్థ ప్రసాదాలను, అక్షింతలను అవమానిస్తున్నాడు. తీర్థ ప్రసాదాలతో కడుపు నిండుతదా అని వాగుతున్నాడు.. ఆయనకు ప్రసాదం తింటే కడుపు నిండదేమో.. ఫుల్ బాటిల్ తాగి చికెన్, మటన్ తింటేనే కడుపు నిండుతదేమో’ అని ఎద్దేవా చేశారు.





