Bandi Sanjay : దేశాన్ని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తున్న మోడీ : బండి సంజయ్‌

Qubetvnews - May 4, 2024 / 10:30 AM IST

Bandi Sanjay : దేశాన్ని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తున్న మోడీ : బండి సంజయ్‌

Bandi Sanjay :

నాలుగు గోడల మధ్య ఏసీ రూంలో కూసోలే, చౌరస్తాల నిలబడి కొట్లాడినం, 5 ఏళ్లలో 7 సార్లు జైలుకు పోయిన.. నా ఒక్కడి కోసం కాదు.. నా కుటుంబం కోసం కాదు.. నా ప్రజల కోసమే పోరాడిన, పోరాడుతూనే ఉంటా అంటూ కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా పలు సంఘాల నాయకులతో భేటీ అయిన బండి సంజయ్ పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోసారి మోడీ ప్రధాని అయితేనే దేశం మరింత అభివృద్ది చెందుతుందని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తున్న మోడీని ప్రధానిగా మరోసారి గెలిపించడం మన అందరి బాధ్యత అన్నాడు.

బండి సంజయ్ ప్రచారంలో భాగంగా.. భారతీయ జనతా మహిళా మోర్చా నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. మహిళల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి మోడీ చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు. మహిళలను రాష్ట్రపతిగా, కీలక శాఖలకు మంత్రులను చేసిన ఘనత మోదీ గారి ప్రభుత్వానిది. మహిళలకు 33 శాతం రిజ్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మోదీ గారి చొరవ వల్ల అతి త్వరలో మహిళల చేతికి అధికార పగ్గాలు రాబోతున్నాయి. నారీ శక్తి పవర్ ఏంటో రాబోయే రోజుల్లో చూడటం తథ్యం. బీఆర్ఎస్ పాలన అంటే గుర్తుకు వచ్చేది అత్యాచారాలు అరాచకాలు అవినీతి. కాంగ్రెస్ ది కూడా అదే పంథా. మహిళలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది. ఆ పార్టీకి ఓటేస్తే ఇక భస్మాసురా హస్తమే. మోడీ గారి పాలన విధానాలు, బిజెపి సిద్ధాంతాలు నచ్చి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరుతున్నారు. ఈ రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిజెపిలో చేరారు.

Bandi Sanjay Said Country Develop More Only If Modi PM Again

Bandi Sanjay Said Country Develop More Only If Modi PM Again

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ మరియు ఇతరత్ర సిబ్బంది గొంతుకై ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాను.. మీకోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశాను.. ఎల్లప్పుడూ మీ పక్షాన నిలిచిన నన్ను నిండుమనసుతో ఆశీర్వదిస్తూ పోస్టల్ బ్యాలెట్ లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ ఎన్నికల బ్యాలెట్ లో 1వ నంబర్‌ – కమలం పువ్వు గుర్తుపై ఓటేసి బంపర్ మెజారిటీతో నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

Bandi Sanjay Said Country Develop More Only If Modi PM Again

Bandi Sanjay Said Country Develop More Only If Modi PM Again

దేశమంతా నరేంద్ర మోడీ గాలి వీస్తుంటే అక్కసుతో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే రిజర్వేషన్లపై పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయడం దుర్మార్గం. శ్రీరాముని అక్షింతలను కూడా కించపరిచే స్థాయికి కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు దిగజారారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదు. బిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలప్పుడు తప్ప, ఏనాడు ప్రజలను కలిసిన దాఖలు లేవు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థుల చరిత్రను బేరీజు వేసి, ఎవరు మేలు చేస్తారో ఆలోచించి తీర్పు ఇవ్వాలని ప్రజలకు బండి విజ్ఞప్తి చేశారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News