Bandi Sanjay : భారత్ ను విశ్వ గురువుగా తీర్చి దిద్దిన ఘనత మోడీదే : బండి సంజయ్
Qubetvnews - May 9, 2024 / 11:17 AM IST
Bandi Sanjay :
దేశాభివృద్ధిని పరుగులు పెట్టించి, టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపి, మహిళలను లక్షాధికారులుగా మార్చి, దాదాపు 25 కోట్ల కుటుంబాలను పేదరిక కోరల్లో నుండి బయట పడేసి భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానిగా చేయాల్సిన మన అందరి బాధ్యత అంటూ కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడలో నిర్వహించిన భారీ బహిరంగ సభళో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…. కాశీ నుంచి మోడి దక్షిణ కాశీకి వచ్చారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదు. కాంగ్రెస్ చవటల్లారా మోదీని విమర్శించే స్థాయి మీకు ఉందా అంటూ ప్రశ్నించారు. ఒకే దేశం.. ఒకే విధానం ఉండాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించామన్నారు. నరేంద్ర మోదీ మేడ్ ఇన్ ఇండియా అని.. సోనియా, రాహుల్ ఏ దేశం వారో చెప్పాలని వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి మోడీ గారినే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన గడ్డ నా కరీంనగర్… ఉదయం 10 గంటలకే పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాని సభను జయప్రదం చేసిన నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అన్నదమ్ములు, అక్కచెల్లెలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు ఇలాగే కలకాలం ఉంటాయని… మే 13న జరిగే ఎన్నికల్లో ఓట్ల రూపంలోనూ చూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అన్నారు.

Bandi Sanjay Speech Infront Of PM Modi
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ గాడిద గుడ్డు ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్ సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు గాడిద గుడ్డు పట్టుకుని రోడ్ల మీద తిరగడం విడ్డూరం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి అంటూ బండి సంజయ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీలతో మోసగించిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నాని ఆరోపించారు. మోదీ పక్కా లోకల్ అని అన్నారు. కాంగ్రెస్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు బాస్మాసుర అస్త్రమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఒక గాడిద గుడ్డు అంటూ సెటైర్ విసిరారు. కాంగ్రెస్ లో ఏ ఒక్కరికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయి లేదని, దేశం ను పదేళ్లలో అభివృద్ది పథంలో పాతికేళ్లు ముందుకు తీసుకు వెళ్లిన ఘనత మోడీ గారిదే అంటూ బండి సంజయ్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.





