Bandi Sanjay : పరిపాలనకి పాతర.. ప్రజాసొమ్ముతో ఎన్నికల జాతర : బండి సంజయ్
Qubetvnews - May 6, 2024 / 11:07 AM IST
Bandi Sanjay :
కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బండి సంజయ్ తన మాటల తూటాలను పెంచారు. అధికార కాంగ్రెస్ పార్టీ పై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో జరిగిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా మద్దతంటూ ప్రకటించిన గ్రామీణ వైద్యులందరికీ నా ధన్యవాదాలు. కోవిడ్ టైంలో గ్రామాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు. పేదలకు భరించగలిగే డబ్బుతోనే చికిత్స చేస్తున్న మీ సేవలు అనిర్వచనీయమైనవి. ఆర్ఎంపీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను.
సమావేశంలో భాగంగా బండి మాట్లాడుతూ.. పరిపాలనకి పాతర వేసి ప్రజా సొమ్ముతో ఎన్నికల జాతర ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఖాతాలు పరిశీలిస్తే కథలు మొత్తం బయటపడ్తయి. ఒక్కొక్క కార్పొరేటర్ అకౌంట్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేసిండ్రు. ఈసీ తక్షణమే కాంగ్రెస్ నాయకుల ఖాతాలను పరిశీలించాలి. కాంగ్రెస్ పార్టీ కొండంత హామీలిచ్చి, గోరంత చేస్తోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడేవారు ప్రజలను, అభివృద్ధిని పెద్దగా పట్టించుకోరని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ పతనానికి పదేళ్లు పడితే, కాంగ్రెస్ కు అంత సమయం పట్టదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తొలి వంద రోజుల్లోనే శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళికను కార్యాచరణలోకి తెచ్చేందుకు మోడీ కృషి చేస్తున్నారు.
కరీంనగర్ కు గత అయిదు సంవత్సరాల్లో తాను తెచ్చిన నిధుల గురించి ఎక్కడ చర్చకు అయినా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మరియు కేంద్రం నుంచి వచ్చిన నిధుల విషయంలో చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్ నాయకులకు బండి సంజయ్ సవాలు విసిరారు. ఈ నియోజకవర్గంలో తనపై పోటీ చేసిన వారి గురించి జనాల్లో కనీసం తెలియను కూడా తెలియదు. కనుక వారికి ఓటు వేయడం వృదా అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మోడీ మళ్లీ ప్రధాని అవుతారు. భద్రత పరంగా ఇతర విషాయల పరంగా దేశం మరింత స్ట్రాంగ్ అవుతుంది అన్నారు.





