Kasani Gnaneshwar : చేవెళ్ల గడ్డపై హ్యాట్రిక్ కొట్టబోతున్న బీఆర్‌ఎస్
Qubetvnews - April 26, 2024 / 07:40 AM IST
Kasani Gnaneshwar :
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మరియు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాసాని కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. వివేకానంద నగర్ డివిజన్ లో కాసాని కి మద్దతుగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసాని ని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దాం అని ఎమ్మెల్యే గాంధీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని అన్నారు. పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని, ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని, కేసీఆర్ ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడప కి వెళ్లి కేసీఆర్ చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ఓట్లు అడుగుదాం అని ఎమ్మెల్యే తెలియచేసారు.
కాసాని జ్ఞానేశ్వర్ కు సీటు ఇవ్వడం ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ బీసీలకు ఇస్తున్న గౌరవంని అర్థం చేసుకోవ్చు. కనుక చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా మూడో సారి ఎగిరి కాసాని పార్లమెంట్ కు వెళ్లడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.





