Etela Rejender : మోడీని మరోసారి పీఎం ను చేద్దాం : ఈటెల రాజేందర్‌

Qubetvnews - April 25, 2024 / 07:27 AM IST

Etela Rejender : మోడీని మరోసారి పీఎం ను చేద్దాం : ఈటెల రాజేందర్‌

Etela Rejender :

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్  కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గంతో పాటు చింతల్‌ లో రోడ్‌ షో లో పాల్గొన్నాడు. ఈటెల రోడ్‌ షో లో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. మండే ఎండను లక్ష్య పెట్టకుండా ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్డు షో లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్దిలో దూసుకు పోవాలి అంటే కచ్చితంగా ప్రధానిగా నరేంద్ర మోడీ మళ్లీ ఎన్నిక అవ్వాల్సిందిగా ఈటెల వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ రెడ్డి పరిపాలనపై ఈటెల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కనీసం ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అని, అధికారం కాపాడుకోవడం కోసం ఆయన తాపత్రయ పడుతున్నాడు కానీ సంక్షేమ పథకాల విషయంలో పూర్తిగా అలసత్వంను కనబర్చుతున్నాడు అంటూ ఈటెల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఎంత కాలం అనేది తెలియదు అని, ఖచ్చితంగా పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం ను చూడబోతున్నామని కూడా ఈటెల అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజక అభివృద్ది కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని ఈటెల రాజేందర్‌ అన్నారు. చింతల్‌ రోడ్‌ షో లో మాట్లాడుతూ తన గెలుపు పై ధీమాగా ఉన్నాడు. ప్రతి నియోజక వర్గంలో అద్బుతంగా అభివృది చేయడంకు తనను గెలిపించాలి అంటూ ఈటెల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ రెడ్డి సర్కారు పై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఈటెల రాజేందర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News