Etela Rajender : అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే : ఈటెల

Qubetvnews - May 3, 2024 / 09:03 AM IST

Etela Rajender : అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే : ఈటెల

Etela Rajender :

మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి అసెంబ్లీ సెమ్మెంట్‌ లో అన్ని వర్గాల ప్రజా సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు షో ల్లో మరియు కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటూ బీజేపీ ని గెలిపించి మూడో సారి మోడీని ప్రధానిగా చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్‌ పార్టీలను విమర్శిస్తూ ఈటెల ప్రచారం కొనసాగుతోంది. ప్రతి చోట కూడా బీజేపీ కి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దేశం లో మూడో సారి బీజేపీ అధికారంలోకి రావడం, ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించడం ఖాయం అంటూ ఈటెల చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా ఈటెల రాజేందర్‌ నేడు ఉప్పల్‌ నియోజకవర్గంలోని రామాంతపూర్ లో రోడ్‌ షో, ఫీర్జాదీ గూడ కుర్మ సంఘం నాయకులతో ఆత్మీయ సమ్మేళనం, మల్కాజ్‌గిరి లో బైక్‌ మెకానిక్స్ అసోషియేషన్‌ వాసులతో ఆత్మీయ సమ్మేళనం, బోడుప్పల్‌ వివేకానంద నగర్‌ వాసులతో బ్రేక్‌ ఫాస్ట్ మీటింగ్‌ లో ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. రామంతపూర్‌ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప రోడ్‌ షో లో పాల్గొన్న ఈటెల రాజేందర్‌ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలు, 66 హామీలు, 420 సమస్యలు… మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటీ అమలు కాలేదు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అది అవుతదా మీరే ఆలోచించండి. ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంతమవుతున్న చెరువులు, సిమెంట్ రోడ్లు, పేదలకు సొంతింటి కల ఇవన్నీ నెరవేర్చే శక్తి, అధికారం బిజెపికి మాత్రమే ఉంది. దేశమంతా ఒకటే నినాదం మరోసారి మోదీ గారు ప్రధాన మంత్రి కావాలి, 400 సీట్లు గెలిపించాలని సంకల్పంతో ఉన్నారు. కాబట్టి అక్కడ మోదీ గారు ఉంటే ఇక్కడ మీరు నన్ను గెలిపిస్తే ఎవరి మధ్యవర్తం లేకుండా, ఎవరి పైరవీ లేకుండా నేరుగా పోయి అన్న మల్కాజ్గిరి కి ఈ సమస్యలు పరిష్కరించండి అంటే పరిష్కరిస్తాడా లేదా మీరే చెప్పండి అన్నారు.

ఒకటి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ప్రజల్ని మోసగించిన వాళ్లపైన పోరాటం చేసే విద్య 14 ఏళ్లుగా నేర్చుకున్న. మన ప్రభుత్వమే వస్తది కాబట్టి ప్రజల సమస్యలు తీర్చి దాంట్లో నేనే ముందుంటా కాబట్టి ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మరొక సారి ధర్మాన్ని, న్యాయాన్ని, సనాతన సంప్రదాయాన్ని, స్వేచ్ఛని, అభివృద్ధిని కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పట్లో విపక్షాలు దేశం విచ్చిన్నమవుతుందని, అల్లకల్లోలమవుతుందని, అధోగతి పాలవుతుందని ఆరోపణలు చేశాయి. కానీ ఈ పదేళ్ల కాలంలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర పథకాలను కూడా తమ పథకాలుగా ప్రకటించుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం వల్ల మోదీ గారు తెలంగాణకు ఏమి చేశారో తెలియకుండా పోయింది. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని 4 కోట్ల ఇళ్లను కట్టించారు. పల్లెటూర్లలో మహిళలకు టాయిలెట్లు లేకపోతే, స్వచ్ఛ భారత్ పథకం కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు కట్టించారు.

బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్ కూటమి అసత్య ప్రచారాలు చేస్తోంది. కానీ బీజేపీ అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించింది. మందకృష్ణ మాదిగ చేస్తున్న కేటగిరీల పోరాటంలో కూడా నరేంద్ర మోదీ గారు తమ మద్దతు తెలియజేశారు. దీనిని బట్టి మనకు అర్థమవుతోంది బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని. మోదీ ప్రధాని అయిన తర్వాత అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని దళితులకు ఇచ్చారు. ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేశారు. అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లు దొందూ దొందే. రైతులకు 15 వేలు రైతుబంధు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ఎవ్వరికీ రాలేదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పే విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఉపయోగించుకుందాం. మల్కాజ్‌గిరిలో నన్ను, ప్రధానిగా మోదీ గారిని కమలం పువ్వు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News