Etela Rajender : మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ : ఈటెల

Qubetvnews - May 4, 2024 / 10:06 AM IST

Etela Rajender : మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ : ఈటెల

Etela Rajender :

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ఎన్నికల ప్రచారంలో జోరు కనబర్చుతున్నారు. సర్వే రిపోర్ట్‌ ల్లో ఈటెల రాజేందర్‌ విజయం దాదాపు ఖాయం అంటూ రావడంతో మెజార్టీ పై ఈటెల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ ఒక్క మూలను వదలకుండా, ఏ ఒక్క సామాజిక వర్గంను కూడా వదిలి పెట్టకుండా ఈటెల రాజేందర్‌ కలుస్తూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శుక్రవారం ఈటెల రాజేందర్‌ ఎల్బీ నగర్‌, రామాంతపూర్‌, వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌ లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర రోడ్డు షో లో పాల్గొనడం జరిగింది. బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్న ఈ యాత్రలో ఈటెల మాట్లాడుతూ బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మన మోడీని మళ్లీ గెలిపించడం మన గ్యారెంటీ.. దేశంను అభివృద్దిలో తీసుకు వెళ్లడం మోడీ గ్యారెంటీ అన్నారు.

భారీగా తరలి వచ్చిన బీజేపీ శ్రేణులను ఉత్సాహ పర్చుతూ ఈటెల మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు… నా తెలంగాణ ఆడబిడ్డలకు 2500, లక్ష రూపాయల కళ్యాణ్ లక్ష్మి తో పాటు తులం బంగారం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు, 4000 పెన్షన్ ఇస్తానని చెప్పావా లేదా అని ప్రశ్నించారు. అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు కేంద్రంలో ప్రధాన మంత్రి అయ్యేది నరేంద్ర మోదీ గారు. పేదలకు ఇల్లు కట్టించే జిమ్మీధర్ నేనే తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. బిజెపి అధికారంలోకి వస్తే మోదీ గారి దగ్గరికి నేరుగా వెళ్ళగలిగే పరిచయం ఉన్న వ్యక్తిని నేనే కాబట్టి మల్కాజ్గిరి కి ఐటి హబ్ రావాలన్న, డ్రైనేజీలు రావాలన్నా, రోడ్లు వేయాలన్న నేను మీ వెంట ఉంటానని హామీ ఇస్తున్న.

కరోనా వచ్చినప్పుడు మీరంతా గడగడా వణికిపోయారు.. నేను దీనికి మందు లేదు, ధైర్యమే మందని పేషంట్ల చుట్టూ తిరిగి వేల మంది పేషెంట్లను కాపాడిన బిడ్డను నేను. ఎనిమిది సంవత్సరాలు అధికారాన్ని చలాయించిన కేసీఆర్ మునుగోడు ఎన్నికల సమయంలో జీవో నెంబర్ 118 ఇచ్చి మీరు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న భూములు, గవర్నమెంట్లో పుక్కడికి ఇచ్చిన భూములు లాగా మార్చింది అంటే ఎంత దుర్మార్గమో ఆలోచించండి. ఈ జీవోను సవరించేంతవరకు ఈటల మీ బిడ్డగా ఉంటాడు, ఆ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా.

భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీలన్నింటి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. అమిత్‌ షా గారు తెలంగాణ ప్రచారానికి వచ్చినప్పుడు 12 సీట్లలో గెలుస్తున్నామని సర్వేల ద్వారా తెలిసిందని చెప్పారు. ప్రధాని మోదీ గారు మల్కాజ్‌గిరిలో రోడ్‌ షో ర్యాలీని చూసి మంత్రముగ్దులయిపోయారు.

మల్కాజ్‌గిరి ప్రజల ఆదరాభిమానాలకు ఎంతో సంతోషించారు. ఈసారి బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన హోం మంత్రి అమిత్ షా గారి సభ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోతోంది. ఈ సభకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కూకట్ పల్లి నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి 6 ఉచిత గ్యారెంటీలు, 66 హామీలు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించాడు. కానీ ఉచిత బస్సు తప్ప మరే హామీని నెరవేర్చలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిపించడానికి రిజర్వేషన్ల అంశాన్ని తెర పైకి తీసుకు వచ్చారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు.

గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయితే తన పరువు ఎక్కడ పోతుందో, తన ముఖ్యమంత్రి పదవి నిలబడుతుందో లేదో అనే బెంగతో ప్రజలను ఆకర్షించడానికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఈటెల విమర్శలు చేశారు. మల్కాజ్‌గిరి చైతన్యవంతమైన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగరు కనుక బీజేపీ విజయం తధ్యం అని ఈటెల పేర్కొన్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News