Bandi sanjay : బండి సంజయ్ కు బంగారం లాంటి ఛాన్స్.. ఎమ్మెల్యేగా ఓడిపోవడం కలిసొస్తుందా..?
Qubetvnews - March 11, 2024 / 09:25 AM IST
Bandi sanjay : బండి సంజయ్ అంటే బీజేపీలో ఓ చెరగని అధ్యాయంలా మిగిలిపోయారు. తెలంగాణలో బీజేపీ అంటే సంజయ్ రాక ముందు.. సంజయ్ హయాంలో అని చెప్పుకునే విధంగా ఆయన మార్చేశారు. అసలు ఊసే లేని పార్టీని ఉవ్వెత్తున ఎగసేలా చేసింది సంజయ్. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాస్తవానికి బండి సంజయ్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంచి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఉంటే మాత్రం కచ్చితంగా బీజేపీకి మెజార్టీ స్థానాలు వచ్చి ఉండేవి. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ అనుకోని రాజకీయాల వల్ల సంజయ్ కు అధ్యక్ష పగ్గాలు లేకుండా పోయాయి.
ఆ ప్రభావం మొన్నటి ఎన్నికల్లో బలంగా కనిపించింది. బీజేపీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి. అంతే కాకుండా బీజేపీలో ఉద్ధండులుగా చెప్పుకునే నేతలు మొత్తం ఓడిపోయారు. బండి సంజయ్ తో పాటు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ్, రఘునందన్ రావు లాంటి హేమాహేమీలు సైతం ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి పోటీ చేయలేదు. ఆయన ప్లాన్ ప్రకారమే పోటీ చేయలేదనే వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ హవా ఉంటుంది. తాను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తాను కేంద్ర మంత్రి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని కిషన్ రెడ్డి భావించారు.
కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా సంజయ్ ఓడిపోవడం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి అడ్డుగా మారిపోయింది. ఎందుకంటే సంజయ్ ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా ప్రచారాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో సంజయ్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ సంజయ్ గనక ఎంపీగా గెలిస్తే ఆయనకు కేంద్రమంత్రి పదవి వచ్చేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఈ సారి సంజయ్ కు ఆ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి తర్వాత కేంద్రంలో సంజయ్ కు బలమైన పట్టు ఉంది. పైగా ఇప్పుడు కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్నాడు. కాబట్టి బీజేపీలో రెండు పదవులు ఒకరికే ఇవ్వరు. ఈ లెక్కన సంజయ్ గనక కరీంనగర్ ఎంపీగా గెలిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి తర్వాత సీనియర్ గా సంజయ్ కు పేరుంది. పైగా ఇప్పటికే పార్టీ పగ్గాలు తీసుకున్న వ్యక్తిగా రికార్డు కూడా ఉంది. ఆయన హయాంలో బీజేపీ హవా పెరిగిందని ఢిల్లీ పెద్దలు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఇప్పుడు అంతకంటే పెద్ద పొజీషన్ లో సంజయ్ ఉండబోతున్నారన్నమాట.





