KCR : కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. ఎన్నికల్లో ప్రచార అస్త్రాలు సిద్ధం..?

Qubetvnews - April 1, 2024 / 09:31 AM IST

KCR : కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. ఎన్నికల్లో ప్రచార అస్త్రాలు సిద్ధం..?

KCR : ఇప్పుడు బీఆర్ ఎస్ కు చాలా కష్టకాలం నడుస్తోంది. ఒకప్పుడు బీఆర్ ఎస్ తరఫున నిలబడేందుకు కుప్పలు తెప్పలుగా అభ్యర్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు టికెట్ ఇచ్చినా సరే వద్దని వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాబోయే రోజుల్లో పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అటు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కోవడంతో పాటు ఇటు పార్టీ మీద అవినీతి ఆరోపణలు రావడం వల్ల బీఆర్ ఎస్ ఇమేజ్ చాలా దెబ్బతింటుంది. అటు పార్టీ లీడర్లపై భూ కబ్జా కేసులు నమోదవుతున్నాయి.

దాంతో పాటు ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ పార్టీని కుదిపేస్తోంది. ఈ కేసులో చాలా పెద్ద లీడర్ల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా వెరసి పార్టీకి చెడ్డ పేరు తెస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోవడం స్టార్ట్ అయింది. దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ నేతలు అందరూ కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కు ఎంపీ ఎన్నికలు పెద్ద సవాల్ గా మారిపోయాయి. వాస్తవానికి ఎంపీ ఎన్నికల్లో ఈ సారి బలమైన అభ్యర్థులు లేరనే చెప్పుకోవాలి. చాలా మంది సీనియర్లు పార్టీని వీడి వెళ్లిపోయారు.

గత ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారంతా ఇప్పుడు పార్టీని వీడి వెళ్లిపోయారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కొత్త వారికి టికెట్లు కేటాయించుకున్నారు. ఈ ఎన్నికల్లో అటు బీజేపీకి, కాంగ్రెస్ కు ప్రచార అస్త్రాలు రెడీగా ఉన్నాయి. బీఆర్ ఎస్ మీద ఇప్పుడు వస్తున్న ఆరోపణలు, కేసులే వారికి ప్రధాన అస్త్రాలుగా మారిపోయాయి. కాబట్టి కేసీఆర్ ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవకపోయినా కనీసం 8 సీట్లు అయినా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రచార అస్త్రాలు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత పదేండ్లలో తాను ఏం చేశానో చెబుతూనే ప్రధానంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేయబోతున్నారంట.

ఈ మూడు నెలల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రచారం చేయబోతున్నారంట. పంటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో ఆయన పర్యటించడానికి బలమైన కారణం కూడా ఇదే. రేపు ఎన్నికల్లో పంటలు ఎండిపోతున్న విషయాన్ని బలంగా ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారంట.

అదే సమయంలో బీజేపీ తెలంగాణకు ఏంచేసిందనే విషయాలపై కూడా విమర్శించే అవకావాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ ప్రధానంగా మాత్రం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేయబోతున్నారంట కేసీఆర్. ఈ ఎన్నికల్లో బీజేపీని పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News