Kcr plans for mp elections : భవిష్యత్తుపై భరోసా ఇస్తూ.. ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న కేసీఆర్..!

Qubetvnews - March 5, 2024 / 09:08 AM IST

Kcr plans for mp elections : భవిష్యత్తుపై భరోసా ఇస్తూ.. ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న కేసీఆర్..!

Kcr plans for mp elections : మొత్తానికి కేసీఆర్ రంగంలోకి దిగిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన తుంటి కాలు సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దాంతో ఇప్పుడు సమరంలోకి దూకబోతున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో పార్టీలో అల్లకల్లోలం నడుస్తోంది. ఇప్పటికే పార్టీని చాలా మంది వీడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే చాలా మంది బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెల్లిపోతున్నారు.

కేటీఆర్ చాలా వరకు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా సరే.. అధినేత కేసీఆర్ మొన్నటి వరకు మౌనంగా ఉండటం వల్ల కొంత నష్టం జరిగిపోయింది. దాంతో ఇప్పుడు కేసీఆర్ అలెర్ట్ అయిపోయారు. ఎవరైతే పార్టీని వీడాలని భావిస్తున్నారో వారిని పిలిచి మాట్లాడుతున్నారు. భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మందితో ఆయన చర్చలు జరపగా.. వారంతా పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. ఇటు అసంతృప్తులను కూడా బుజ్జగించే పనుల్లో పడ్డారు కేసీఆర్.

ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి.. నేతలను కాపాడుకోవడం కేసీఆర్ కు చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు తన పార్టీ నేతలను కాపాడుకోవడంతో పాటు అటు ఎంపీ ఎన్నికలకు కూడా సిద్ధం అవుతున్నారు గులాబీ బాస్. ఇప్పటికే ఎంపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను తన ఇంట్లోనే నిర్వహిస్తున్నారు. అటు అంసతృప్తులను ఆపుతూనే ఇటు ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. ఇప్పటికే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడారు. కాబట్టి పార్టీ గ్రాఫ్‌ ను ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో పెంచుకోవాలి.

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గనక సాధిస్తే.. మళ్లీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి అసంతృప్తులు ఎవరూ కూడా పార్టీని వీడకుండా ఉంటారనేది కేసీఆర్ నమ్మకం. అందుకే ఇప్పుడు ఈ విషయంలో కేసీఆర్ అన్ని విధాలుగా ముందుకు సాగుతున్నారు. అటు కరీంనగర్ నుంచి ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలపెట్టబోతున్నారు.

ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో కూడా ఓ భారీ బహిరంగ సభను పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని జిల్లాల్లో సభలను ప్లాన్ చేసుకుంటున్నారు. వీలైనంత వరకు బస్సు యాత్ర లేదా రోడ్ షోలను పెట్టుకోవాలని గులాబీ బాస్ అభిప్రాయ పడుతున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News