Patnam Sunitha Mahender Reddy : మహిళల జీవితాల్లో వెలుగు నింపేందుకు ముందడుగు : పట్నం సునీత మహేందర్ రెడ్డి
Qubetvnews - May 5, 2024 / 10:30 AM IST
Patnam Sunitha Mahender Reddy :
మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంతో పాటు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రచారంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరిస్తు సునీత మహేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు అందరూ ఎల్లవేళలా నాతో ఉంటారన్న ధైర్యమే నన్ను ఇంత దూరం తీసుకు వచ్చింది.
నా గెలుపు వరకు నాకు తోడుగా నిలుస్తాయారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అంగన్వాడీ, ఆశ వర్కర్ మరియు మధ్యాహ్నం భోజనం తయారు చేసే మహిళల జీవితాల్లో వెలుగు నింపే దిశగా ముందడుగు వేస్తున్నాం. మహిళలకు వారి యొక్క హక్కులపై అవగాహన కల్పించే విధంగా ప్రతి గ్రామంలో హక్కుల మైత్రి నియామకం. దుర్గమ్మ టెంపుల్ రాజు కాలనీ ఇస్మాయిల్ సాయి నగర్ వివేకానంద నగర్ రాజీవ్ గాంధీ నగర్ కుషా నగర్ లో నిర్వహించిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలిపించండి అని ప్రజలను కోరుతున్నాను.
నరసింహ స్వామి ఆలయంలో ఈ రోజు లక్ష్మి నరసింహ స్వామి గారి బ్రహ్మోత్సవాలు లో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జవహర్ నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో మరియు మహిళా ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డ్ నెంబర్ 5 గాంధీ నగర్ లో నిర్వహించిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలిపించండి అని ప్రజలను కోరారు. ఎల్ బి నగర్ మరియు కూకట్పల్లి నియోజకవర్గాల్లో పలు పార్టీ సమావేశాల్లో పాల్గొని, నూతనంగా పార్టీ లో చేరిన నాయకులను సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. విస్తృతస్థాయి ప్రచారాల్లో భాగంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో మీటింగులకు హాజరు అయ్యారు.

Manisha Reddy Campaigning In Support Of Patnam Sunitha Mahender Reddy
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. శనివారం కేపీహెచ్‌బీలో మనీషా రెడ్డి గడప గడపకు తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే రోడ్ షో కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. తన తల్లి సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తారని మనీషా రెడ్డి హామీ ఇచ్చారు.
కేపీహెచ్‌బీ 114వ డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ దేంది అరవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనీషా రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి కోసం సునీత మహేందర్‌రెడ్డికి ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.





