Patnam Sunitha Mahender Reddy : నేను నాన్ లోకల్ అయితే ప్రజలకి అందుబాటులో ఉండని ఈటెల ఎవరు? – సునీత మహేందర్ రెడ్డి

Qubetvnews - April 28, 2024 / 11:59 AM IST

Patnam Sunitha Mahender Reddy : నేను నాన్ లోకల్ అయితే ప్రజలకి అందుబాటులో ఉండని ఈటెల ఎవరు? – సునీత మహేందర్ రెడ్డి

Patnam Sunitha Mahender Reddy :

నాయకుడంటే నమ్మి పదవిచ్చిన ప్రజలకి న్యాయం చేయాలి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చి ఓటేసిన జనాల తిప్పలు తీర్చాలి. కానీ ఎలక్షన్ల సమయంలో అమలు కాని హామీలిచ్చి, గెలిచాక ప్రజలకు మొహం చాటేసి, మళ్లీ ఎలక్షన్లొచ్చినప్పుడు మాత్రం నేను మీ మనిషిని అంటూ ప్రచారం చేసుకోవడమే ఈటెల లాంటి నేతల నైజం అంటూ విమర్శించారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి. 2004 నుంచి అప్పట్లో కమలాపూర్, ఆ తర్వాత హుజూరాబాద్ కి ఈటెల ఏం చేశారో, ప్రజలకి ఏం మేలు చేశాడో చెప్పాలని ప్రశ్నించారు.

ఉప ఎన్నికల్లో 20 హామీలతో మ్యానిఫెస్టో ఇచ్చి, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదనీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో హుజూరాబాద్ లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తా అని మాటిచ్చి ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. నాంపల్లి సొసైటీ ఎగ్జిబిషిన్ చైర్మన్ గా అవకతకవల ఆరోపణలు, జమున హేచరీస్ పేరుతో 70.33 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణంటూ కలెక్టర్ల నివేదికలు నిజం కాదా అని ప్రశ్నించారు సునీత.

మేం నాన్ లోకల్ అంటూ విమర్శిస్తున్న ఈటెల, హుజూరాబాద్ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉన్నారు? హుజూరాబాద్ లో ఓడిపోయాక అటు వైపు చూడడమే మానేసి, అక్కడి ప్రజల్ని కలసిన దాఖలాలే లేని ఈటెల, కాంగ్రెస్ అభ్యర్థి లోకల్ కాదంటూ చెప్తున్న మాటలు వింతగా ఉన్నాయంటూ మండిపడ్డారు సునీత. బీఆర్ ఎస్ లో ఉంటే తన అక్రమాలు సాగవని, బీజేపీలో చేరి, అక్కడా గ్రూపు రాజకీయాలు చేసి చివరికి పార్టీలో ఆయనను ఎవరూ పట్టించుకోని స్థాయికి దిగజారిన ఆయన, ప్రజలకేం న్యాయం చేస్తాడన్నారు సునీత. పిలిస్తే పలికే మీ ఇంటిబిడ్డ కావాగా, అక్కగా చెల్లిగా అందరికి అందుబాటులో ఉంటూ, నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాకే ఓటేసి గెలిపించండి అంటూ అభ్యర్థించారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News