Bonthu Rammohan : బొంతు రామ్మోహన్ కే సికింద్రాబాద్ ఎంపీ టికెట్.. రేవంత్ మార్క్ ప్లాన్..?

Qubetvnews - March 6, 2024 / 10:25 AM IST

Bonthu Rammohan : బొంతు రామ్మోహన్ కే సికింద్రాబాద్ ఎంపీ టికెట్.. రేవంత్ మార్క్ ప్లాన్..?

Bonthu Rammohan : తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు బీజేపీ, బీఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తుంటే.. కాంగ్రెస్ కూడా కీలకమైన చోట్ల అభ్యర్థులను ఆచి తూచి ఎంచుకుంటోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలి. లేదంటే మిగతా పార్టీల ముందు చిన్నచూపే కదా. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమకు పట్టులేని హైదరాబాద్, సికింద్రాబాద్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ట్విన్ సిటీస్ లో ఎమ్మెల్యే సీట్లు చాలా తక్కువ వచ్చాయి.

అందుకే ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ స్థానం గెలవాలని పట్టుదలగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఈ టికెట్ ను కచ్చితంగా గెలిచే వారికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా రీసెంట్ గానే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన బొంతు రామ్మోహన్ కే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పెద్దగా పట్టు లేదు. బీఆర్ ఎస్ నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందుకే ఆ పార్టీకి చెందిన నేతను లాక్కుని టికెట్ ఇస్తే కచ్చితంగా ఓట్లు చీల్చవచ్చన్నది రేవంత్ ప్లాన్.

పైగా రామ్మోహన్ కు జీహెచ్ ఎంసీ మేయర్ గా చేసిన అనుభవం ఉంది. ఆయనకు ఆ ఏరియాలో అందరు నేతలతో మంచి పట్టు కూడా ఉంది. అంతే కాకుండా ఆయన మేయర్ గా ఉన్న సమయంలోనే మెట్రో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం కావచ్చు.. ఇతర ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అలాగే డ్రైనేజీ సిస్టమ్ లో డెవలప్ మెంట్ లాంటివి ఆయన హయాంలోనే జరిగాయి. అందుకే ఆయన పట్ల హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు కూడా మంచి భావన ఉంది. పైగా ఆయన భార్య కూడా ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్నారు. గతంలో బీఆర్ ఎస్ లో ఆయన మేయర్ గా చేసినప్పుడు కార్పొరేటర్లతో మంచి పరిచయాలు కూడా ఏర్పడ్డాయి.

ఆ పరిచయాలు, స్నేహాలు ఇప్పుడు ఆయనకు ఓట్లు మళ్లించే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు సికింద్రాబాద్ టికెట్ లోకల్ క్యాండిడేట్ అయిన రామ్మోహన్ కే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ, బీఆర్ ఎస్ కు గట్టి బలమే ఉంది.

కాబట్టి ఇప్పుడు ఆ రెండు పార్టీలకు బలమైన పోటీ ఇవ్వాలటే బొంతు రామ్మోహన్ అయితేనే బాగుంటుదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారంట. మొత్తానికి ఈ విధంగా బీజేపీ, బీఆర్ ఎస్ కు రామ్మోహన్ చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News