Pawan Kalyan : పవన్ ది చావో రేవో అన్న పరిస్థితి పాపం.. ఈ ఎన్నికల్లో ఓడితే అంతే ఇంక

Qubetvnews - April 28, 2024 / 10:17 AM IST

Pawan Kalyan : పవన్ ది చావో రేవో అన్న పరిస్థితి పాపం.. ఈ ఎన్నికల్లో ఓడితే అంతే ఇంక

Pawan Kalyan :

పదేళ్ల జనసేన ప్రస్థానంలో రాజకీయంగా పవన్ గానీ, పార్టీ గాని సాధించింది ఏమైనా ఉందా? అని ప్రశ్న వేసుకుంటే సమాధానం శూన్యమే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అంటూ జనసేనని స్థాపించినా.. ఆ తర్వాత పవన్ రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితొచ్చింది. ఈ దశాబ్ధ కాలంలో ఏపీ మొత్తంగా ఎక్కడా ఏ పదవులూ లేకుండా, పార్టీ కోసం పనిచేస్తున్నాడని చెప్పుకోడానికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మిగిలిపోయింది జనసేన.

గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు పవన్. ఫ్యాన్స్ ట్వీట్లేస్తారు గానీ ఓట్లేయరు అన్న నిజాన్ని తెలుసుకుని ఈ అయిదేళ్ల కాలంలో అడపా దడపా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఈ ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు యాత్రలు, నిరసనలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం సాగించాడు. ఈ సారి ఎలాగైనా గెలవాలని, ఒంటరిగా బరిలోకి దిగితే కష్టమే అనీ కూటమితో చేతులు కలిపి సీట్లు పంచుకున్నాడు.

ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని గ్రహించిన పవన్.. ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి అంటూ సభల్లో చాలాసార్లు చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. ఈసారి జనసేన జెండా ఎగరకపోతే తన పదేళ్ల ప్రయాసంతా వ్యర్థమే అని గ్రహించిన పవన్ అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీలు పీకే తరఫున ప్రచారం చేస్తున్నారు. చివరికి అన్న చిరంజీవి కూడా రంగంలోకి దిగి తమ్ముడి గెలుపు కోసం ప్రచారం చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో పవన్ ది చావో రేవో అన్న పరిస్థితి అని. మరి కూటమి ప్రయత్నం ఫలించో, ఇందరి ప్రచారం కలిసొచ్చో, జనసేన పరిస్థితి ఈ సారి ఎంత మెరుగవుతుందో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News