Pawan Kalyan : టీడీపీని భయపెడుతున్న పవన్ ప్రకటన.. చిచ్చు రాజుకుందా..?
Qubetvnews - February 20, 2024 / 09:20 PM IST
Pawan Kalyan :
ఏ ముహూర్తాన టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయో గానీ… అప్పటి నుంచి ఆ రెండు పార్టీల నడుమ అంతర్గంగా అగ్గి రాజుకుంటోంది. అధినేతలు అయిన వపన్’-చంద్రబాబు ఇప్పటి వరకు ఒక సయోధ్యకు రాలేదు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు అయితే కత్తులు దూసుకుంటున్నారు. మా సీట్లు మాకే కావాలి అని టీడీపీ నేతలు.. మాకు సముచితమౌన సీట్లు రావాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. దాంతో ఇప్పటి వరకు సీట్ల పంపకాలు జరగట్లేదు. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఇంకా సీట్ల పంపకాలు జరగకపోవడంతో రెండు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతున్నాయి. జనసేన పార్టీ చేసిన ప్రకటనలో.. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మన కూటమి అధికారంలోకి వస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై, గెలచిన తర్వాత ప్రభుత్వంలో వచ్చే అవకాశాలపై కూడా దృష్టి సారించాలి. మనం మూడింట ఒక వంతు అవకాశాలను, పదవులను దక్కించుకోబోతున్నాం. కాబట్టి దీనికి అందరూ రెడీగా ఉండాలి. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం దక్కే విధంగా చూస్తాను. 2019 తర్వాత పార్టీ నిలబడటం కోసం పని చేస్తున్న అందరికీ పదవులు వచ్చేలా చూస్తాను.
నా ఒక్కడి గెలుపు కోసం కాకుండా సమిష్టి గెలుపుకోసమే నా ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ పవన్ కల్యాణ్ తరఫున పార్టీ ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనలో కీలకంగా మూడింట ఒక వంతు పదవులు, స్థానాలు దక్కించుకుంటాం అని చేసిన కామెంట్ ఇప్పుడు టీడీపీలో అగ్గి రాజేస్తోంది. పవన్ చెప్పినట్టు మూడింట ఒక వంతు అంటే కనీసం 58 స్థానాల్లో ఎమ్మెల్యేలను పోటీ చేయించాలి. కానీ అన్ని సీట్లు జనసేనకు ఇస్తే టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానికి టీడీపీ నేతలు అస్సలు ఒప్పుకోరు. పైగా ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మూడింట ఒక వంతు అంటే మామూలు విషయం కాదు.
ఈ ప్రకటనతో జనసేన పార్టీ హ్యాపీగానే ఉంటుంది. కానీ ఎటొచ్చి టీడీపీ ఫైర్ అవుతోంది. ఎందుకంటే తమ అవకాశాలను జనసేన తన్నుకు పోతుంటే వారు ఎందుకు మౌనంఆ ఉంటారు చెప్పండి. అందుకే ఇప్పుడు పవన్ చేసిన ప్రకటనతో వారు రగిలిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు అన్ని సీట్లు ఇచ్చేది లేదని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.
జనసేనకు అన్ని సీట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటి అనేది వారి ప్రశ్న. జనసేనకు నిజంగా అంత సీన్ ఉందా అంటే లేదనే అంటున్నారు టీడీపీ నేతలు. కాబట్టి తమ సీట్లను జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ లు ఇస్తున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే ఇక సీట్లు ప్రకటించిన తర్వాత ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి.



