Pawan Kalyan : భీమవరంలో భయపడి పిఠాపురానికి పవన్ షిఫ్ట్ అయ్యాడా..?
Qubetvnews - February 28, 2024 / 06:13 PM IST
Pawan Kalyan :
పవన్ కళ్యాన్ పోటీ చేసేంది భీమవరం నుంచా పిఠాపురం నుంచా ? ఈసారి గెలుపు కాదు.. భారీ మెజార్టీయే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జనసేనాని. జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరికి షిఫ్ట్ అవడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఈసారి ఒకచోట నుంచి మాత్రమే పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన మొదట నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసేందుకే మొగ్గు చూశారు.
కానీ ఎందుకో తెలీదు కానీ భీమవరం కంటే కూడా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచే పోటీ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించినట్లు జనసేన నేతలు చర్చించుకుంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే అది కాకినాడ ఎంపీ అభ్యర్థికీ ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జిగా ఉదయ్ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తే టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వర్మ సహకరిస్తారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కళ్యాణ్ గనుక పిఠాపురానికి వెళితే… మరి భీమవరం అభ్యర్థి ఎవరు?. భీమవరం సీటు జనసేన ఖాతాలోనే ఉంటుందా? ఉంటే ఎవరిని బరిలోకి దించుతారు? అనే ప్రశ్నలపై ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తోంది. పవన్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తారోలేదో ఇంకా అధికారిక ప్రకటన రానేలేదు. భీమవరం టికెట్ కోసం అప్పుడే జనసేనలో రేస్ మొదలైనట్లు తెలుస్తోంది.
అప్పుడెప్పుడో ఏడు సిద్ధాంతాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తానని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రగల్భాలు పలికారు. ప్రస్తుతం ఆయన మాటలకు, చేతలకు అసలు సంబంధమే కనిపించడం లేదు. తాను కులాలు, మతాలకు అతీతమని పదేపదే చెప్పుకుంటుంటాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, జాగ్రత్తగా వుండాలని కూడా ఆయన హెచ్చరించడం తెలిసిందే. ఇన్నేసి నీతులు చెప్పిన పవన్‌కల్యాణ్… చివరికి ఆయన చేసేది కుల ప్రాతిపదికన రాజకీయాలని ఆరోపిస్తున్నారు జనాలు.
ఆ క్రమంలోనే తాను పోటీ చేసే స్థానంపై కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంపై సర్వేలు చేయించుకుని మరీ బరిలో దిగుతున్నారని సమాచారం. అందుకే పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించారని సమాచారం. దీనికి ప్రధాన కారణం పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు 90 వేలకు పైగా ఉండడం. అంటే సగం ఓటర్లు కాపులే అని పవన్ గుర్తించారు. దీంతో పిఠాపురంలో అయితే గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారు.




