Pawan Kalyan : చేతికి రెండు ఉంగరాలతో పవన్.. రాజకీయంగా కలిసొస్తుందా..!

Qubetvnews - February 22, 2024 / 11:01 AM IST

Pawan Kalyan : చేతికి రెండు ఉంగరాలతో పవన్.. రాజకీయంగా కలిసొస్తుందా..!

Pawan Kalyan :

ప్రతి వ్యక్తికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. దానికి చిన్నా, పెద్ద వారు అనే తేడాలు ఉండవు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ కూడా ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. సినిమాల్లో పెద్ద స్టార్ గా ఉన్న పవన్ కల్యాణ్‌ కు రాజకీయాల్లో మాత్రం పెద్దగా కలిసి రావట్లేదు. అందుకే ఆయన ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు పవన్ కల్యాణ్‌. అదొక్కటి చేస్తే సరిపోదని అనుకున్నారు కాబోలు.

అందుకే ఇప్పుడు తన జాతకాన్ని కూడా బలంగా నమ్ముకుంటున్నారు. ఆయన ఇలాంటి నమ్మకాలు పెంచుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా అనేక సార్లు యాగాలు, పూజలు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. దాంతో పాటు గతంలో కొన్ని ఉంగరాలను కూడా పెట్టుకున్నారు పవన్ కల్యాణ్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఎన్నికల కోసం ఉంగరాలను పెట్టుకుంటున్నారు. ఆయన జాతకం ప్రకారం చూస్తే ఆయన పుట్టింది 1971 సెప్టెంబరు 2. కుజ రాహువు సంధి, రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయంట. అందుకే ఆయన మకరరాశిలో కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నాడు.

చంద్ర మంగళ యోగం ఉన్నప్పటికీ, కుజ రాహువు సంధి ప్రభావం ఉండడం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశం ఉందని చెబుతున్నారు. దీని వల్ల రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు రెండో ఉంగరం కూర్మావతారం ఉంగరం. ఇది తాబేలు ప్రతిమను కలిగి ఉంటుంది. ఇది ఎదుగదలకు, ప్రజాకర్షణకు బాగా కలిసి వస్తుంది. అందుకే ఈ రెండు ఉంగరాలను పవన్ కల్యాణ్ పెట్టుకున్నారు. మరి ఈ ఉంగరాలు ఆయనకు ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News