Nara Lokesh : నమ్మకం గురించి మీరే చెప్పాలి లోకేష్.. గతం మర్చిపోయారా..?

Qubetvnews - February 21, 2024 / 10:40 AM IST

Nara Lokesh : నమ్మకం గురించి మీరే చెప్పాలి లోకేష్.. గతం మర్చిపోయారా..?

Nara Lokesh :

ఈ నడుమ లోకేష్‌ చేస్తున్న మాటలు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తున్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు లోకేష్ కూడా తమ తప్పులను మర్చిపోయి జగన్ మీద బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు శంఖారావం పేరుతో లోకేష్ పర్యటనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో జగన్ మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ.. జగన్ ను తన సొంత చెల్లెలు షర్మిల నమ్మట్లేదని.. సొంత చెల్లులు నమ్మని వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నిస్తున్నారు.

సొంత తల్లి, చెల్లెలుకు న్యాయం చేయలేని వ్యక్తి ఇంక ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు.. కాబట్టి అతన్ని నమ్మొద్దు.. అతనికి ఓట్లు వేయొద్దని లోకేష్ చిలక పలుకులు పలుకుతున్నారు. అయితే ఇటు వైసీపీ వాళ్లు కూడా గట్టిగానే కౌంటర్ వేస్తున్నారు. జగన్ ను ప్రశ్నించే ముందు మీ తండ్రి గారి ఘనకార్యం ఏంటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెబుతున్నారు. గతంలో ఇదే చంద్రబాబు తన సొంత తమ్ముడు అయిన రామ్మూర్తి నాయుడుకు రాజకీయ జీవితం లేకుండా చేసిన ఘటనను మర్చిపోయారా అని కౌంటర్ వేస్తున్నారు వైసీపీ నేతలు.

జగన్ తో షర్మిల విభేదించేనాటికి ఆమెకు స్థిరమైన రాజకీయ జీవితం లేదు.. జగన్ తో విభేదించిన తర్వతనే ఆమె ప్రత్యేక రాజకీయాలు చేస్తున్నారు. కానీ రామ్మూర్తి నాయుడు అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చంద్రబాబు ఆయనకు రాజకీయం జీవితం లేకుండా చిదిమేశాడు. ఇప్పుడు అదే రామ్మూర్తి నాయుడు చంద్రబాబు మీద ఏ మాత్రం ప్రేమ, అభిమానులు లేకుండా ఉండటాన్ని మర్చిపోయారా అని చెబుతున్నారు. అంతెందుకు సొంత పిల్ల నిచ్చిన మామ అయిన సీనియర్ ఎన్టీఆర్ కే వెన్ను పోటు పొడిచిన ఘలన కూడా ఉంది కదా అని విమర్శిస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ నడి రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టారో మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వంచకుడు ప్రపంచంలోనే ఉండడంటూ సీనియర్ ఎన్టీఆర్ ఎన్ని ఆరోపణలు చేశారో మర్చిపోయారా అని వైసీపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు. ఇక హరికృష్ణ ఉదంతాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

YCP Leaders Are Countering Nara Lokesh Who Accused YS Jagan

YCP Leaders Are Countering Nara Lokesh Who Accused YS Jagan

చంద్రబాబు మోసాన్ని తట్టుకోలేక హరికృష్ణ వేరే పార్టీ పెట్టుకోవడం.. తర్వాత ఆయనకు మాయ మాటలు చెప్పి తిరిగి పార్టీలోకి తీసుకోవడాన్ని కూడా గుర్తు చేసి మరీ లోకేష్ కు దిమ్మతిరిగే కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. ఇంత మంది కుటుంబ సభ్యులకు ద్రోహం చేసిన చంద్రబాబుకు ఏ మాత్రం విశ్వాసం ఉందో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్ ను.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News