Bandi Sanjay : బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేలా బీజేపీ ప్లాన్.. ఎమ్మెల్యేలను లాగేస్తారా..?
Qubetvnews - February 17, 2024 / 10:21 AM IST
Bandi Sanjay :
బీఆర్ ఎస్ పార్టీని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పదేండ్లుగా టార్గెట్ చేశాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. అసలు మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్తుందనే ప్రచారం తెరమీదకు వచ్చింది. కొందరు బీఆర్ ఎస్ నేతలు కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. దాంతో ఆ విషయాన్ని కాంగ్రెస్ కూడా సీరియస్ గా తీసుకుంది. అసలు తమ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము లాగేస్తామని సంచలనం రేపింది.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంపీ ఎన్నికల తర్వాత లాగేస్తామని చెప్పడం సంచలనం రేపింది. అప్పటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన సన్నాహాలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బీజేపీ కీలక నేత అయిన బండి సంజయ్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు తమ పార్టీతో టచ్ లోకి వచ్చారని ఆయన చెప్పడం సంచలనం రేపుతోంది.
ఇప్పుడు కరీంనగర్ నుంచి ఎంపీగా బండి సంజయ్ పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన అన్ని విధాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇలాంటి కామెంట్లు చేయడం పెద్ద వివాదమే రాజేస్తోంది. బండి సంజయ్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. ఆయన పార్టీలో కీలకగా ఉంటున్నారు. ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప ఆయన ఇలాంటి కామెంట్లు చేయరు. అలాంటిది ఇప్పుడు బండి సంజయ్ ఇలాంటి కామెంట్లు చేశారు అంటే త్వరలోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లడం ఖాయమే అని అంటున్నారు రాజకీయ నిపుణులు. అంటే బీజేపీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోందన్న మాట.
ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్ ను కుదిపేస్తోంది. అసలు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నేతలను కలిసింది ఎవరా అనే సందేహం అందరిలోనూ వస్తోంది. బీఆర్ఎస్ గ్రాఫ్ ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతూనే వస్తోందని చెప్పడానికి ఇవే సంకేతాలు అంటున్నారు రాజకీయ నిపుణులు.
బీఆర్ఎస్ నుంచి ఎవరు వెళ్లినా సరే అది పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుంది. అందుకే ఇప్పుడు ఇలాంటి వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. బీజేపీ టార్గెట్ చేస్తే కచ్చితంగా దెబ్బతింటామని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు ఎవరూ పార్టీని వీడకుండా ఎలా చూసుకుంటారో వేచి చూడాలి.





